News November 18, 2024
రాష్ట్రంలో ఇంటింటి సర్వే 65.02% పూర్తి
TG: రాష్ట్ర వ్యాప్తంగా 75,75,647 నివాసాల్లో సమగ్ర సర్వే పూర్తి అయింది. దీంతో ఇంటింటి కుటుంబ సర్వే 65.02 శాతం పూర్తి అయినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ములుగు జిల్లా 95.3శాతంతో తొలి స్థానంలో నిలిచింది. నల్గొండ 89.1, జనగామ 86 శాతం సర్వేతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. GHMCలో అతి తక్కువగా 44.3 శాతం సర్వే పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News December 11, 2024
వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: CM CBN
AP: దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్‌లో సగం కూడా ఇవ్వడంలేదు. వచ్చే ఏడాది స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం. దీపం-2 పథకం కింద 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం. సంక్రాంతి నాటికి ఆర్అండ్‌బీ రోడ్లపై గుంతలు ఉండకూడదు’ అని కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించారు.
News December 11, 2024
మా నాన్న చేసిన తప్పు అదే: విష్ణు
తమను అమితంగా ప్రేమించడమే మోహన్ బాబు చేసిన తప్పు అని మంచు విష్ణు అన్నారు. ‘ప్రతి ఇంటిలోనూ సమస్యలు ఉంటాయి. మా సమస్యను పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మా ఇంటి గొడవను మీడియా సెన్సేషన్ చేస్తోంది. అలా చేయొద్దని వేడుకుంటున్నా. మా నాన్న ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టును కొట్టలేదు. ఆ జర్నలిస్టు కుటుంబంతో మేం టచ్‌లో ఉన్నాం. వారికి చెప్పాల్సింది చెప్పేశాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News December 11, 2024
మస్క్‌తో పెట్టుకుంటే మటాషే.. బిల్‌గేట్స్‌కు ₹12500 కోట్ల నష్టం!
మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్‌కు ఎలాన్ మస్క్ గట్టి పంచ్ ఇచ్చారు. ‘ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా టెస్లా ఎదిగితే, షార్ట్ పొజిషన్ తీసుకుంటే బిల్‌గేట్స్ సైతం దివాలా తీయాల్సిందే’ అని అన్నారు. కొవిడ్ టైమ్‌లో సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు టెస్లా షేర్లను గేట్స్ షార్ట్ చేశారు. ఈ పొజిషన్ ఆయనకు రూ.12500 కోట్ల నష్టం తెచ్చిపెట్టినట్టు సమాచారం. మళ్లీ ఈ విషయం వైరలవ్వడంతో మస్క్ పైవిధంగా స్పందించారు.