News February 27, 2025

డిగ్రీ అర్హతతో 650 బ్యాంకు ఉద్యోగాలు

image

IDBI బ్యాంకులో 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి మార్చి 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లికేషన్లకు మార్చి 12 లాస్ట్ డేట్. అభ్యర్థులు డిగ్రీ పాసై, 20-25 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు SC, ST, PWD అభ్యర్థులకు రూ.250, మిగతా వారికి రూ.1050.
వెబ్‌సైట్: https://www.idbibank.in/

Similar News

News March 21, 2025

BREAKING: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

image

ప్రముఖ కన్నడ దర్శకుడు AT రఘు(76) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కన్నడ రెబల్ స్టార్ అంబరీశ్‌తో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. 55 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన తొలి చిత్రం ‘న్యాయ నీతి ధర్మ’.

News March 21, 2025

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 58,872 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా..23,523 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.

News March 21, 2025

అలా చేస్తే టీమ్ ఇండియాలో చోటు: సురేశ్ రైనా

image

భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. IPLలో 500 పరుగులు చేస్తే ఇండియా టీమ్‌లో చోటు దక్కే అవకాశముందని అన్నారు. యంగ్ ప్లేయర్లు తిలక్ వర్మ, రింకూ సింగ్, జైస్వాల్‌కు తాను పెద్ద అభిమాని అని చెప్పారు. చాలా మంది ప్లేయర్లు తన టాలెంట్‌ను ప్రదర్శించి అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటారని పేర్కొన్నారు. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనా.. టీ20WC, వన్డే WC, CT నెగ్గిన భారత జట్టులో సభ్యుడు.

error: Content is protected !!