News December 6, 2024
నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 6,700 ఖాళీలు
<<14810561>>ఏపీ, తెలంగాణతోపాటు<<>> దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్తగా 28 నవోదయ, 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో వాటి వల్ల ఉపాధి అవకాశాలు కూడా కలగనున్నాయి. ఈ విద్యా సంస్థల ద్వారా నూతనంగా 6,700 ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని కేంద్రం అంచనా. ఇందులో కేవీల్లో 5,388 ఖాళీలు, నవోదయాల్లో 1,316 పోస్టులు అందుబాటులోకి వస్తాయి. త్వరలోనే వీటిని భర్తీ చేసే అవకాశం ఉంది. Share It.
Similar News
News January 18, 2025
తిరుమలలో అపచారం
కలియుగ దైవం కొలువైన తిరుమల కొండపై అపచారం జరిగింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు కొండపైకి కోడిగుడ్డు పలావ్ తీసుకొచ్చారు. రాంభగీచ బస్టాప్ వద్ద వారు ఈ నిషేధిత ఆహారపదార్థాలు తింటుండగా భక్తులు చూసి అధికారులకు ఫిర్యాదు చేశారు. తిరుమల నియమాలు తమకు తెలియదని వారు చెప్పారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. అలిపిరి వద్ద తనిఖీ సిబ్బంది డొల్లతనం వల్లే ఇలా జరిగిందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News January 18, 2025
GOOD NEWS: ఉచితంగా ప్లాట్లు
AP: ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి <<15179066>>ఇళ్ల స్థలాలు<<>> ఇస్తామని నిన్న ప్రకటించింది. ఇవి ఉచితమా? డబ్బు చెల్లించాలా? అనే సందేహాలు ఉన్నాయి. అయితే ఈ ప్లాట్లు పూర్తి ఉచితంగా ఇస్తారు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున కేటాయిస్తారు. కేంద్ర పథకాలతో ఈ కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరచనున్నారు. గతంలో ప్లాట్లు పొంది ఇళ్లు నిర్మించుకోని వారికి వాటిని రద్దు చేసి కొత్త ప్లాట్లు ఇస్తారు.
News January 18, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. అలిపిరి వద్ద ట్రాఫిక్ జామ్
AP: తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. అలిపిరి చెక్ పాయింట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. రేపటితో వైకుంఠ ద్వార దర్శనం ముగియనుంది. అటు సంక్రాంతి సెలవులు కూడా రేపటితో ముగియనుండటంతో భక్తులు శ్రీనివాసుడి దర్శనం కోసం వస్తున్నట్లు తెలుస్తోంది.