News June 19, 2024
టీడీపీకి 6వ స్థానం.. వైసీపీకి 15వ స్థానం
41 పార్టీలకు చెందిన ఎంపీలతో 18వ లోక్‌సభలో సభ్యుల సంఖ్యాపరంగా టీడీపీ 6వ అతిపెద్ద పార్టీగా నిలుస్తోంది. మొత్తం సభలో 240 మంది ఎంపీలతో బీజేపీ టాప్-1లో ఉండగా, కాంగ్రెస్-99, సమాజ్‌వాదీ పార్టీ-37, TMC-29, DMK-22 స్థానాలతో టీడీపీ కంటే ముందున్నాయి. 16 మంది ఎంపీలతో టీడీపీ 6వ స్థానంలో ఉండగా, నలుగురు ఎంపీలున్న వైసీపీ 15వ స్థానంలో నిలిచింది.
Similar News
News September 18, 2024
మద్యం వ్యాపారం ప్రైవేటుకే అప్పగింత
AP: ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. 3,396 షాపులను నోటిఫై చేయనుంది. గీత కార్మికుల కోసం 396 దుకాణాలను కేటాయిస్తారు. ఏ రాష్త్ర వ్యక్తయినా దరఖాస్తు చేసుకుంటే లాటరీ ద్వారా లైసెన్సులు ఇస్తారు. ఇవాళ క్యాబినెట్ భేటీలో చర్చించి, ఈ నెల 22, 23 తేదీల్లో కొత్త పాలసీపై ఉత్తర్వులిస్తారు. OCT4, 5 నాటికి కొత్త విధానం అమల్లోకి రానుంది.
News September 18, 2024
ట్రంప్‌నకు ఫోన్ చేసి పరామర్శించిన కమల
డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి <<14112153>>హత్యాయత్నం<<>> జరిగిన నేపథ్యంలో ఆయనకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన క్షేమంగా ఉండటంపై సంతోషం వ్యక్తం చేసినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ట్రంప్‌నకు సమీపంలో కాల్పుల ఘటనను ఆమె ఇప్పటికే ఖండించారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్, డెమొక్రాట్ పార్టీ నుంచి కమలా బరిలో దిగుతున్నారు.
News September 18, 2024
వంట నూనెల ధరలు పెంచొద్దన్న కేంద్రం
వంట నూనెల ధరలను పెంచొద్దని సంబంధిత సంస్థలను కేంద్రం ఆదేశించింది. తక్కువ సుంకానికి దిగుమతి చేసుకున్న వంట నూనెల స్టాక్ దాదాపు 30 లక్షల టన్నులు ఉందని తెలిపింది. ఇది 45-50 రోజులకు సరిపోతాయంది. కాగా అధిక దిగుమతులతో నూనె గింజల ధరలు దేశీయంగా పడిపోతుండటంతో కేంద్రం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతో ధరలు పెరుగుతాయన్న వాదనలు వినిపిస్తుండటంతో పరిశ్రమ వర్గాలతో కేంద్రం సమావేశమై సూచనలు చేసింది.