News September 6, 2024
7వేల ఇళ్లు నేలమట్టం.. బాధితులకు ఇందిరమ్మ గృహాలు
TG: భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 7వేల ఇళ్లు కూలిపోయాయని ప్రభుత్వానికి కలెక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో బాధితులకు ఇందిరమ్మ గృహాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూలిన ఇళ్లలో ఎక్కువగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోనే ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద స్థలం ఉంటే ₹5లక్షలు, లేని వారికి స్థలం+₹5లక్షలు ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
Similar News
News September 13, 2024
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి కేంద్రమంత్రులకు సీఎం ఆహ్వానం
TG: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ కార్యక్రమానికి హాజరుకావాలంటూ నలుగురు కేంద్రమంత్రులకు CM రేవంత్ ఆహ్వానం పంపారు. వీరిలో అమిత్ షా, గజేంద్ర షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. 1948 SEP 17న TGలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని CM తెలిపారు. ఆరోజు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆయన జెండా ఆవిష్కరిస్తారు.
News September 13, 2024
VLSRSAM క్షిపణుల ప్రయోగం విజయవంతం
ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల ‘వెర్టికల్ లాంఛ్’ స్వల్ప పరిధి క్షిపణుల్ని(VLSRSAM) భారత్ నిన్న, ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ITR)లో ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది. తక్కువ ఎత్తులో తీవ్రవేగంతో ఎగిరే లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించామని తెలిపింది. శత్రు విమానాలు, హెలీకాప్టర్లు, డ్రోన్ల వంటివాటిని ఈ క్షిపణులు నేలకూల్చగలవు.
News September 13, 2024
‘దేవర’ను ఇంటర్వ్యూ చేసిన యంగ్ హీరోలు
‘దేవర’ రిలీజ్ టైమ్(ఈ నెల 27) సమీపిస్తుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివను యంగ్ హీరోలు విశ్వక్‌సేన్, సిద్ధూ జొన్నలగడ్డ ఇంటర్వ్యూ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. యంగ్ టైగర్‌తో ఫ్యాన్ బాయ్స్ ఇంటర్వ్యూ అదిరిపోయి ఉంటుందని, దీని కోసం ఎదురుచూస్తున్నామని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.