News January 5, 2025

ఇజ్రాయెల్‌ దాడుల్లో 70 మంది మృతి

image

పాల‌స్తీనాపై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్ర‌ం చేస్తోంది. శ‌నివారం నుంచి జరిపిన 30 వేర్వేరు దాడుల్లో 70 మంది మృతి చెందారు. గాజాపై విరుచుకుప‌డుతున్న ఇజ్రాయెల్‌ను నిలువ‌రించ‌డానికి ఆ దేశ బంధీల వీడియోల‌ను హ‌మాస్‌ విడుద‌ల చేస్తోంది. మ‌రోవైపు ఇజ్రాయెల్‌కు 8 బిలియ‌న్ డాల‌ర్ల ఆయుధాల స‌ర‌ఫ‌రాకు బైడెన్ అంగీక‌రించ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా యుద్ధంలో 45,658 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.

Similar News

News January 7, 2025

చైనా వైరస్.. వ్యాపించేది ఇలా

image

దేశంలో hMPV కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ వైరస్ సోకినవారు తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపర్ల ద్వారా, వారితో సన్నిహితంగా మెలగడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుంది. నవజాత శిశువులు, ఐదేళ్లలోపు పిల్లలు, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిపై ప్రభావం ఎక్కువ. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 3-6 రోజుల తర్వాత లక్షణాలు(జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరి ఆడకపోవడం) కన్పిస్తాయి.

News January 7, 2025

ఈనెల 10న బీజేపీ నిరసనలు

image

TG: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు BJP ప్రకటించింది. ఆరోజున కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా రైతు భరోసా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. పాలనకు బీసీలు పనికి రారని CM రేవంత్ గతంలో వ్యాఖ్యానించారని మండిపడ్డారు.

News January 7, 2025

విశాఖలో డ్రోన్లపై నిషేధం

image

AP: నేటి నుంచి 2 రోజుల పాటు విశాఖలో డ్రోన్లపై నిషేధం విధించారు. రేపు PM మోదీ పర్యటన ఉండటంతో ఆయన పర్యటించే రూట్లలో 5 కి.మీ పరిధిలో ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ప్రైవేట్ డ్రోన్ల వినియోగదారులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం విశాఖలో పర్యటించనున్న మోదీ రూ.2లక్షల కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత ప్రధాని నగరంలో రోడ్ షో నిర్వహించి సభాస్థలి వద్దకు చేరుకుంటారు.