News April 12, 2025

ఫస్టియర్‌లో 70%, సెకండియర్‌లో 83% మంది పాస్

image

AP: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓవరాల్‌గా ఫస్ట్ ఇయర్‌లో 70%, సెకండియర్‌లో 83% మంది విద్యార్థులు పాసైనట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2014 నుంచి ఇదే అత్యధిక పాస్ పర్సెంటేజ్ అని తెలిపారు. GOVT జూనియర్ కాలేజీల్లో సెకండియర్‌లో 69 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం పదేళ్లలో అత్యధికమన్నారు. ఫస్టియర్‌లోనూ 47 శాతం మంది పాసయ్యారని, ఇది దశాబ్దంలో రెండో అత్యధికమని తెలిపారు.

Similar News

News April 13, 2026

ANUలో అవకతవకలపై విచారణ.. నివేదికపై సందిగ్ధం!

image

ఆచార్య నాగార్జున వర్సిటీలో గత పాలనలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిగినా స్పష్టత లేదు. ఇప్పుడు ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. నిధుల దుర్వినియోగం, నియామకాల్లో అక్రమాలు వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించినా నివేదిక బయటకు రాలేదు. వారం గడుస్తున్నా చర్యలు కనిపించకపోవడం విమర్శలకు దారి తీసింది. అదే వ్యక్తులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News April 13, 2026

పందుల నుంచి పంటను కాపాడే ద్రావణం!

image

కొందరు రైతులు పందుల బారి నుంచి తమ పంటను రక్షించుకోవడానికి కుళ్లిన కోడిగుడ్లను నీటిలో కలిపి పంట చుట్టూ చల్లుతున్నారు. ఈ ద్రావణం నుంచి వచ్చే సల్ఫర్ వాసన పందులకు చాలా అసహ్యంగా అనిపించడంతో పాటు పంట సహజ వాసనను వాటికి రానివ్వదు. దీంతో పందులు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం పడినా లేదా వారం తర్వాత వాసన తగ్గిపోతే ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ మళ్లీ చల్లాల్సి ఉంటుంది.

News April 13, 2026

రేపు CBSE టెన్త్ ఫలితాలు?

image

CBSE టెన్త్ క్లాస్ సెషన్-1 పరీక్షల ఫలితాలు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇవాళ సాయంత్రంలోపు బోర్డు ప్రకటన చేయనున్నట్లు సమాచారం. https://www.cbse.gov.in/లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి-మార్చిలో జరిగిన ఈ ఎగ్జామ్స్‌కు దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోసం సెషన్-2 పరీక్షలు మే 15 నుంచి జరగనున్నాయి.