News June 30, 2024
ISS కూల్చివేతకు రూ.7000 కోట్లు!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని<<13518740>>(ISS)<<>> కూల్చివేసేందుకు నాసా ప్రణాళికలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థతో 843 మిలియన్ డాలర్లు(రూ.7000 కోట్లకు పైమాటే) ఒప్పందం కుదుర్చుకుంది. దీని జీవిత కాలం 2030తో ముగుస్తుంది. ఆ తర్వాత దీన్ని తొలగించనున్నారు. ఇది భూమికి 400km ఎత్తులో పరిభ్రమిస్తుంటుంది. US, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా దేశాలు దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి.
Similar News
News November 21, 2025
బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.