News March 19, 2024
71,246 మంది ‘డిపాజిట్’ గల్లంతు
దేశంలో 1951 నుంచి ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికల్లో 91,160 మంది పోటీ చేయగా, 71,246 మంది <<12002638>>డిపాజిట్<<>> కోల్పోయినట్లు EC డేటాలో వెల్లడైంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి 1951లో జనరల్ అభ్యర్థులకు ₹500, SC, STలకు ₹250 సెక్యూరిటీ డిపాజిట్ ఉండేది. ప్రస్తుతం ఆ మొత్తం జనరల్ క్యాండిడేట్లకు ₹25వేలు, ఎస్సీ, ఎస్టీలకు ₹12,500గా ఉంది. పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్లు రాకుంటే ఆ మొత్తం ఈసీ ట్రెజరీకి వెళ్తుంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News September 21, 2024
లాలూ కుటుంబానికి మరిన్ని చిక్కులు
ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో కేంద్ర రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు CBI కాపీ సమర్పించింది. ఈ కేసులో CBI ఇప్పటికే లాలూ, అయన కుటుంబ సభ్యుల పాత్రపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి అనుమతి లభించడంతో ఛార్జిషీట్‌ను కోర్టు ఇప్పుడు సమీక్షించి వారిపై అభియోగాలు మోపనుంది.
News September 21, 2024
ANR విలన్‌గా ఎందుకు చేయలేదో తెలుసా!
తన లోపాలను తెలుసుకోవడమే తన విజయానికి కారణమని అక్కినేని నాగేశ్వరరావు చెబుతుండేవారు. ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక, విలన్ పాత్రలు వేశారు. కానీ అక్కినేని ఒక్కసారీ విలనీ వైపు వెళ్లలేదు. పౌరాణికాల్ని పెద్దగా టచ్ చేయలేదు. తన రూపం, కంఠం అందుకు సరైనవి కావని ఆయన భావించడమే దానిక్కారణం. కానీ సాంఘిక సినిమాల్లో మాత్రం విశ్వరూపం చూపించారు. నేడు ఆ మహానటుడి శతజయంతి. సినిమా ఉన్నంతకాలం ఆయన మన మధ్య జీవించే ఉంటారు.
News September 21, 2024
అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు: నాదెండ్ల
AP: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్టోబర్ 1నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తామన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. పంట నష్టం, తడిసిన ధాన్యానికి సంబంధించి విధివిధానాలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు బకాయి పెట్టిన రూ.1700 కోట్లను తాము చెల్లించామని పేర్కొన్నారు.