News April 2, 2024
యాసంగి ధాన్యం కొనుగోలుకు 7149 కేంద్రాలు

TG: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని సీఎస్ శాంతి తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు 7149 కేంద్రాలను ఏర్పాటు చేశామని.. నాలుగైదు రోజుల్లో అవి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 11, 2026
ప్యారడైజ్‌లో ‘సుబ్బు’గా కయాదు.. లుక్ అదుర్స్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కయాదు లోహర్ బర్త్ డే సందర్భంగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ప్యారడైజ్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ‘సుబ్బు’ పాత్రలో నటిస్తున్న కయాదు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వైట్& బ్లూ కలర్ డ్రెస్‌లో క్యాప్ ధరించి వింటేజ్ లుక్‌లో సైకిల్‌పై వెళ్తున్న ఈ ముద్దుగుమ్మ లుక్ ఆకట్టుకుంటోంది.
News April 11, 2026
2028 నుంచి పెట్రోల్ బైకుల రిజిస్ట్రేషన్ నో

కాలుష్య నివారణే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-30ని డ్రాఫ్ట్ చేసింది. 30 రోజుల పాటు నిపుణులు, ప్రజల నుంచి సలహాలు తీసుకొని దాన్ని ఖరారు చేయనుంది. 2028 ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్‌తో నడిచే టూవీలర్లను ఢిల్లీలో రిజిస్టర్ చేయరు. కేవలం ఈవీలు మాత్రమే చేస్తారు. అలాగే ఈవీలు కొనేవారికి భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. 100% రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయించారు.
News April 11, 2026
గ్రాఫిక్స్‌లో ‘రామాయణ’ తగ్గేదేలే!

రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ సినిమా బాలీవుడ్‌లో కొత్త విజువల్ వండర్‌గా నిలవనుంది. హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ తరహాలో అత్యాధునిక VFX, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఈ చిత్రం కోసం ఉపయోగిస్తున్నారు. ఆస్కార్ గెలిచిన DNEG సంస్థ గ్రాఫిక్స్ బాధ్యతలు చూస్తోంది. దాదాపు ₹4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


