News October 21, 2024
గ్రూప్-1 మెయిన్స్‌కు 72.4% హాజరు

TG: ఇవాళ జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 72.4% హాజరు నమోదైంది. మెయిన్స్‌కు మొత్తం 31,383 అభ్యర్థులు అర్హత సాధించగా, నేడు 22,744 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ ఎగ్జామ్స్ ఈనెల 27 వరకు కొనసాగనున్నాయి. జీవో 29 రద్దు చేయాలని, పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, తాము జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News February 9, 2026
అర్ధరాత్రి వింత అనుభవం: సుధా చంద్రన్

నటి, డాన్సర్ సుధా చంద్రన్ పూనకానికి సంబంధించిన <<18761618>>వీడియో<<>> కొద్ది రోజుల క్రితం వైరల్ అయిన నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు. గతంలోనూ తనకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయన్నారు. గుజరాత్‌లో ఓ షూటింగ్ సమయంలో తనపై ఓ శక్తి దాడి చేసినట్లు చెప్పారు. అర్ధరాత్రి గదిలో నిద్రపోతుండగా ఛాతీ బరువుగా అనిపించిందని, చేతులు కదలలేదన్నారు. చివరకు భక్తితో దేవుని నామస్మరణ చేయడంతో ఉపశమనం కలిగిందన్నారు.

జోరుగా ప్రచారం.. ఎవరిదో పీఠం!

TG: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ తరఫున స్వయంగా CM రేవంత్ సహా మంత్రులు బరిలోకి దిగారు. అటు KTR, హరీశ్ రావు, కీలక నేతలు BRS కోసం ఓట్లు అభ్యర్థించారు. BJP నుంచి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా MPలు ప్రచారం చేశారు. ఎల్లుండి 52.43 లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ నెల 13న ఫలితాలు వెలువడతాయి.