News October 21, 2024
గ్రూప్-1 మెయిన్స్‌కు 72.4% హాజరు
TG: ఇవాళ జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 72.4% హాజరు నమోదైంది. మెయిన్స్‌కు మొత్తం 31,383 అభ్యర్థులు అర్హత సాధించగా, నేడు 22,744 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ ఎగ్జామ్స్ ఈనెల 27 వరకు కొనసాగనున్నాయి. జీవో 29 రద్దు చేయాలని, పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, తాము జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News November 4, 2024
ఉపఎన్నికల తేదీ మార్చిన ఎన్నికల సంఘం
కేరళ, పంజాబ్, యూపీలో నవంబర్ 13న పలు అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నవంబర్ 20వ తేదీకి మార్చింది. కేరళలోని పాలక్కడ్, పంజాబ్‌లోని 4 స్థానాలు, యూపీలోని 9 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఈ తేదీ మార్పు వర్తిస్తుంది. Nov 13న మతపరమైన కార్యక్రమాలు ఉన్నందునా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తేదీ మార్పుపై బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు విజ్ఞప్తి చేసినట్టు EC వెల్లడించింది.
News November 4, 2024
వరల్డ్ టాప్-5 సిటీల్లో అమరావతిని నిలుపుతాం: మంత్రి నారాయణ
AP: ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి నగరాల్లో అమరావతి నిలిచేలా చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధానితో మూడుముక్కలాట ఆడిందని విమర్శించారు. ప్రస్తుతం రూ.30వేల కోట్లకు సంబంధించి టెండర్ పనులు మొదలయ్యాయని తెలిపారు. డిసెంబర్ చివరికల్లా అన్ని టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. వరల్డ్ బ్యాంక్ రూ.15వేల కోట్ల రుణమిస్తోందని, 3ఏళ్లలో పనులు పూర్తి కావాలని CM ఆదేశించారన్నారు.
News November 4, 2024
రోహిత్, విరాట్ భారత క్రికెట్‌కు చాలా చేశారు కానీ..: మాజీ క్రికెటర్
ఆస్ట్రేలియాతో జరిగే BGTలో రాణించకపోతే రోహిత్, విరాట్ టెస్టుల నుంచి రిటైర్ కావాలని భారత మాజీ బౌలర్ కర్సన్ గవ్రీ అభిప్రాయపడ్డారు. ‘ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశాన్ని ఓడించాలంటే సీనియర్లు రన్స్ చేయాల్సిందే. రోహిత్, విరాట్ భారత క్రికెట్‌కు చాలా చేశారు. కానీ జట్టు గెలవాలంటే రన్స్ కావాలి. భవిష్యత్ కోసం కొత్త జట్టును నిర్మించాలి. పర్ఫార్మెన్స్ ఇవ్వకుంటే ఎంతకాలం టీంలో ఉంచుతారు’ అని ప్రశ్నించారు.