News August 8, 2024
రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి రూ.7,266 కోట్లు

AP: రాష్ట్రంలో రూ.7,266 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. పలు కీలక ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ తూర్పు బైపాస్కు రూ.2,716 కోట్లు, వినుకొండ-గుంటూరు రోడ్డుకు రూ.2,360 కోట్లు, సబ్బవరం-షీలానగర్ రోడ్డుకు రూ.906 కోట్లు, విజయవాడ మహానాడు జంక్షన్-నిడమానూరు రోడ్డుకు రూ.669 కోట్లు, చెన్నై-కోల్కతా హైవేపై రణస్థలం రహదారికి రూ.325 కోట్లు కేటాయించింది.
Similar News
News March 17, 2026
BREAKING: పెరిగిన బంగారం, వెండి ధరలు

కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం, వెండి ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,58,620కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 ఎగబాకి రూ.1,45,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు పెరిగి రూ.2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 17, 2026
జనగణనలో అడిగే ప్రశ్నలివే!

జనగణన-2027లో <<19386795>>భాగంగా<<>> అధికారులు ప్రజల నుంచి 33 ప్రశ్నలకు సమాధానాలను యాప్ ద్వారా సేకరిస్తారు. ముఖ్యంగా ఇంటి యజమాని వివరాలు, సొంతిల్లా/అద్దెదా, నీరు- విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్డి, వంటగ్యాస్, వాహనం, TV& ఫోన్ వంటి కనీస సౌకర్యాల గురించి తెలుసుకుంటారు. అలాగే వ్యక్తిగత వివరాలైన వయసు, లింగం, చదువు, కులం, మతం, మాతృభాష, ఆహార అలవాట్లు, వలస వివరాలు అడుగుతారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయో తెలుసుకుంటారు.
News March 17, 2026
పూజా సమయంలో ఏ రంగు దుస్తులు ధరించాలి?

పూజలో మనస్సును ప్రశాంతంగా ఉంచే సాత్విక రంగుల దుస్తులు ధరించడం శ్రేయస్కరం. సానుకూలతనిచ్చే పసుపు రంగు విష్ణుమూర్తికి ప్రీతికరం. తెలుపు పరిశుద్ధతకు, శాంతికి ప్రతీక. శివారాధనలో తెలుపు, శక్తి పూజల్లో ఎరుపు, గులాబీ ధరించడం ఉత్తమం. ఉదయం పూజకు పసుపు, తెలుపు రంగులు ఉత్తమం. అయితే, శని పూజలో మినహా నలుపు నిషిద్ధం. ముదురు నీలం రంగులను కూడా వాడకపోవడమే మంచిది. ఉతికిన శుభ్రమైన కాటన్ దుస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి.


