News August 8, 2024
రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి రూ.7,266 కోట్లు
AP: రాష్ట్రంలో రూ.7,266 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. పలు కీలక ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ తూర్పు బైపాస్‌కు రూ.2,716 కోట్లు, వినుకొండ-గుంటూరు రోడ్డుకు రూ.2,360 కోట్లు, సబ్బవరం-షీలానగర్ రోడ్డుకు రూ.906 కోట్లు, విజయవాడ మహానాడు జంక్షన్-నిడమానూరు రోడ్డుకు రూ.669 కోట్లు, చెన్నై-కోల్‌కతా హైవేపై రణస్థలం రహదారికి రూ.325 కోట్లు కేటాయించింది.
Similar News
News December 13, 2024
BREAKING: RBI హెడ్ క్వార్టర్స్‌కు బాంబు బెదిరింపులు
ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ ఆగంతుకులు బెదిరించారు. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్‌కు బెదిరింపు మెయిల్ చేశారు. రష్యన్ భాషలో ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు కూడా ఇవాళ వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటన్నింటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News December 13, 2024
నేడు భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ తమిళనాడు వద్ద గురువారం అర్ధరాత్రి తీరం దాటింది. కాగా, ఇవాళ ఉదయం బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్లు పేర్కొంది. అటు, అల్పపీడనం తీరం దాటిన సందర్భంగా TNలో భారీ వర్షాలు పడుతున్నాయి.
News December 13, 2024
స్టాక్ మార్కెట్లు విలవిల.. RS 2.5L CR నష్టం
స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 24,389 (-156), సెన్సెక్స్ 80,742 (-540) వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు రూ.2.5లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు. అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, IT, ఫార్మా, మెటల్, కమోడిటీస్, ఎనర్జీ రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. టాటా స్టీల్, JSW స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, INDUSIND టాప్ లూజర్స్. AIRTEL, ADANIENT టాప్ గెయినర్స్.