News July 22, 2024
ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు అవసరం
పెరుగుతున్న కార్మిక శక్తికి తగినట్టుగా వ్యవసాయేతర రంగంలో 2030 వరకు ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. చివరి ఆరేళ్లలో దేశీయ కార్మిక సూచీలు మెరుగయ్యాయని వెల్లడించింది. 2022-23లో నిరుద్యోగ రేటు 3.2 శాతానికి తగ్గిందని తెలిపింది. ఏఐ వల్ల ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొందని పేర్కొంది. లో, సెమీ, హై స్కిల్డ్ ఉద్యోగులపై ప్రభావం పడుతుందని వెల్లడించింది.
Similar News
News October 14, 2024
మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు
AP: ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తిరుపతి నుంచి వైజాగ్ వరకు కోస్తా ప్రాంతమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, మచిలీపట్నం, కాకినాడ, విశాఖలో వానలు పడుతున్నాయి. ఈ మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల్లోనూ వానలు ప్రారంభమవుతాయని తెలిపారు.
News October 14, 2024
గాజా పరిస్థితులపై కమలా హారిస్ ట్వీట్
యుద్ధవాతావరణంతో గాజాలోని ప్రజలు ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. ‘దాదాపు 2 వారాలుగా ఉత్తర గాజాలోకి ఎలాంటి ఆహారం వెళ్లలేదని UN నివేదించింది. అవసరమైన వారికి ఆహారం అందించేలా ఇజ్రాయెల్ అత్యవసరంగా యుద్ధాన్ని నిలిపివేయాలి. పౌరులను రక్షించాలి. ఆహారం, నీరు, మెడిసిన్స్ వారికి అందించాలి. మానవతా చట్టాన్ని గౌరవించండి’ అని ట్వీట్ చేశారు.
News October 14, 2024
తమిళనాడులో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, సేలం జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. వాహనాలు నీట మునిగాయి. కావేరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరుతో పాటు మరో 15 జిల్లాలకు అక్కడి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.