News March 29, 2025
79వేల ఎస్సీ కుటుంబాలకు సోలార్ ప్యానల్స్: కలెక్టర్

ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా జిల్లాలో ఉన్న 79 వేల షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు ఏపీ ట్రాన్స్కో బ్యాంకర్ల సమన్వయంతో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ట్రాన్స్కో అధికారులు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో ఇప్పటి వరకు సూర్య ఘర్ పథకానికి అర్హులైన వారి జాబితాపై సమీక్షలు నిర్వహించారు. మూడు నెలల్లోగా ఏర్పాటు చేయాలన్నారు
Similar News
News March 31, 2025
ఇరగదీసిన కొత్త కుర్రాడు

కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కొత్త బౌలర్ అశ్వనీ కుమార్ ఇరగదీశాడు. ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలింగ్‌తో 3 ఓవర్లలో 24 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. IPL డెబ్యూలోనే 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా రహానే, రింకూ, మనీశ్, రసెల్ వికెట్లను దక్కించుకున్నాడు. బుమ్రా తరహాలో మరో మాణిక్యాన్ని MI వెలికితీసిందని, త్వరలోనే అతడు భారత్‌కు ఆడతాడని క్రికెట్ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.
News March 31, 2025
గ్రూప్-1లో మంథని యువకుడికి 114వ ర్యాంకు

మంథని మండలం కాన్సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల అరుణ్ కుమార్ ర్యాంకుల పరంపర కొనసాగిస్తున్నాడు. తాజాగా గ్రూప్-1లో అరుణ్ కుమార్ రాష్ట్రస్థాయిలో 114వ, మల్టీ జోన్-1 స్థాయిలో 64వ ర్యాంక్ సాధించాడు. 2018లో ట్రిపుల్ ఐటీ జబల్‌పూర్‌లో బీటెక్(సీఈసీ) పూర్తిచేశాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయిలో 35వ ర్యాంక్, గ్రూప్-3లో రాష్ట్రస్థాయిలో 81వ ర్యాంక్ సాధించాడు.
News March 31, 2025
200 సిక్సర్లు.. ధోనీ అరుదైన రికార్డు

CSK ప్లేయర్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పారు. 30 ఏళ్ల వయసు దాటాక ఐపీఎల్‌లో 200 సిక్సులు బాదిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా నిలిచారు. ప్రస్తుతం 43వ వడిలో ఉన్న మిస్టర్ కూల్ నిన్న RRతో మ్యాచ్‌లో తుషార్ వేసిన 19వ ఓవర్‌లో సిక్స్ కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా క్రిస్‌గేల్(347) ఎవరికీ అందనంత దూరంలో ఉన్నారు. ఇక ధోనీ తర్వాత రోహిత్(113), అంబటి రాయుడు(109), దినేశ్ కార్తీక్(104) ఉన్నారు.