News January 27, 2025
8 మంది బందీలు మరణించారు: హమాస్

కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తొలి విడతలో హమాస్ 33 మంది బందీల విడుదలకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో 8 మంది చనిపోయినట్లు హమాస్ వెల్లడించిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ఇప్పటికే ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. ఈ క్రమంలో పలువురు బందీలు మరణించడంపై ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News February 19, 2025
చరిత్రలోనే పెద్ద మోసం: మస్క్

అమెరికా సామాజిక భద్రతా విభాగంలో డేటాబేస్ పూర్తిగా తప్పని, ‘చరిత్రలోనే ఇది పెద్ద మోసమని’ మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 100సంవత్సరాల పైబడినవారు 2కోట్లమంది, 200ఏళ్లు దాటిన వారు 2వేలమంది. 369 సంవత్సరాల వ్యక్తి జీవించి ఉన్నట్లు డేటాబేస్ ఉందని తెలిపారు. మరణించిన వారి సమాచారం (SSA)లో నమోదు చేయకపోవడంతో ఈసమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. జనాభా లెక్కల ప్రకారం 100ఏళ్లు దాటిన వారు 86వేలు ఉన్నట్లు తెలిపారు.
News February 19, 2025
VIRAL: అమ్మాయిల ఇన్‌స్టా స్టోరీ పోస్ట్

ఓ యువతీయువకుడు సంతోషంగా కలిసున్నప్పుడు, తర్వాత ఆ యువతి తీవ్రంగా గాయపడ్డ ఫొటోల పోస్ట్ ఒకటి ఇన్‌స్టాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దానికి ‘డియర్ గర్ల్స్. మీ ఫ్యూచర్ పార్ట్‌నర్‌ని మనసు, వ్యక్తిత్వం చూసి ఎంచుకోండి కానీ ముఖం, డబ్బు చూసి కాదు’ అని క్యాప్షన్ రాశారు. అబ్బాయి అందం, డబ్బు చూసి మోసపోయిన అమ్మాయి చివరికి ఇలా బాధపడాల్సి వస్తుందని అర్థమొచ్చే ఈ పోస్ట్‌ను చాలామంది అమ్మాయిలు స్టోరీగా పెట్టుకున్నారు.
News February 19, 2025
CT: విధ్వంస వీరుడి ఖాతాలో అత్యధిక రన్స్

మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు WI మాజీ ప్లేయర్ గేల్ పేరిట ఉంది. 17 మ్యాచుల్లో 3 సెంచరీలు, ఒక అర్ధసెంచరీతో 791 పరుగులు చేశారు. తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(742), ధవన్(701), సంగక్కర(683), గంగూలీ(665) ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ప్లేయర్లలో కోహ్లీ(529), రోహిత్(481) పరుగులు చేశారు. మరి ఈ టోర్నీలో వీరు అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొడతారా? కామెంట్ చేయండి.