News December 23, 2024

శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 77,260 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24,223 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.12కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.

Similar News

News December 23, 2024

రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని TFCC నిర్ణయం

image

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌కు అండగా ఉంటామని తెలిపింది. వారి కుటుంబానికి సాయం చేసేందుకు మనీ డొనేట్ చేయాలని ఛాంబర్ మెంబర్లను కోరుతూ సర్క్యులర్ జారీ చేసింది.

News December 23, 2024

తప్పు చేసిన ఎవరినీ వదలం: మంత్రి కొల్లు రవీంద్ర

image

AP: మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం మాయం చేసింది వాస్తవం కాదా? అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. దారి మళ్లిన బియ్యం స్కామ్‌పై వివరణ ఇచ్చుకోలేని దుస్థితి ఆయనది అని ఎద్దేవా చేశారు. తప్పు చేయనప్పుడు దొంగలా తప్పించుకొని తిరగడమెందుకని నిలదీశారు. తప్పు చేసిన ఎవరినీ వదలబోమని చెప్పారు. రేషన్ కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తామని, విచారణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు.

News December 23, 2024

అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయించింది కాంగ్రెస్సే: బీఆర్ఎస్

image

TG: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ముఠాను KTR పంపారని ప్రచారం చేస్తున్న వారిపై BRS మండిపడింది. ‘గూండాలతో అల్లు అర్జున్ ఇంటిపై దాడులు చేయించి కాంగ్రెస్ పార్టీ అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు ఫేక్ ఎడిట్లతో ముందుకు వచ్చింది. రేవంత్ సర్కార్ డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతోంది. ఫేక్ ఎడిట్లు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని X వేదికగా హెచ్చరించింది.