News December 23, 2024

శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వరస్వామిని 77,260 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 24,223 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.12కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.

Similar News

News January 17, 2025

భీమిలి: కాకరకాయ జ్యూస్ అనుకుని పురుగుమందు తాగి మృతి

image

భీమిలి ఎమ్మార్వో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న <<15172608>>ముస్తఫా<<>> ఈనెల15న ఉదయం కాకరకాయ జ్యూస్ అని భావించి పురుగుమందు తాగడంతో మృతి చెందాడు. తనకు షుగర్ వ్యాధి ఉండడంతో రోజు కాకరకాయ జ్యూస్ తాగుతాడు.14న మొక్కలకి పిచికారి చేసేందుకు పురుగుల మందు తీసుకువచ్చి గ్లాస్‌లో ఉంచాడు. ఆ విషయం మర్చిపోయి పురుగుల మందు తాగాడు. భార్య ఫాతిమా పురుగుల మందు ఏదని ప్రశ్నించడంతో తాగింది పురుగుమందు అని తెలిసింది.

News January 17, 2025

రేపటి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం

image

AP: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో భావర్ కంపెనీ దీన్ని నిర్మించనుంది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించాల్సి ఉంటుంది. కాగా 2016లోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారు. 2020 తర్వాత వరదలకు కొంత భాగం కొట్టుకుపోయింది.

News January 17, 2025

రూ.3.20 లక్షల ప్రశ్న.. జవాబు తెలుసా?

image

KBCలో అమితాబ్ బచ్చన్ క్రికెట్‌పై మరో ప్రశ్న అడిగారు. 2024 NOVలో టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మెక్‌కల్లమ్ రికార్డును బద్దలుకొట్టింది ఎవరు అని ప్రశ్నించారు. ఆప్షన్లు A.యశస్వీ జైస్వాల్ B.ఇషాన్ కిషన్ C.సర్ఫరాజ్ ఖాన్ D.శుభ్‌మన్ గిల్. ఈ రూ.3.20 లక్షల ప్రశ్నకు కంటెస్టెంట్ గిల్ అని తప్పుడు జవాబిచ్చారు. దీంతో అతడు రూ.1.60 లక్షలే గెలుచుకోగలిగారు. సరైన జవాబు కామెంట్ చేయండి.