News April 18, 2024

జువైనల్ హోం నుంచి 8మంది పరారీ

image

TG: మేడ్చల్ జిల్లా గాజులరామారంలో జువైనల్ హోం నుంచి 8మంది పరారు కావడం సంచలనంగా మారింది. వివిధ నేరాల్లో ప్రమేయమున్న 32మంది బాలురు ఈ హోంలో ఆశ్రయం పొందుతున్నారు. కాగా.. మధ్యాహ్నం పాలు తాగే సమయంలో గందరగోళం సృష్టించారు. ఒకరు కాపలాదారుడిని తోసుకొని పారిపోగా.. మరో 7మంది తరగతిలోని గ్రిల్స్ తొలగించి పరారయ్యారు. అక్కడి సిబ్బంది సస్పెండ్ అయ్యారు.

Similar News

News September 14, 2024

సముద్రంలో భారీ ‘దేవర’ కటౌట్

image

Jr.NTR ‘దేవర’ క్రేజ్ రోజురోజుకీ పీక్స్‌కు చేరుకుంటోంది. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ముంబైలోని దాదర్ చౌపటీ బీచ్ వద్ద సముద్రంలో భారీ ‘దేవర’ కటౌట్ ఏర్పాటు చేసింది. గణేశ్ నిమజ్జనం చేసేటప్పుడు ఈ కటౌట్ చూడవచ్చని దేవర టీమ్ ట్వీట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. Sept 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుందీ చిత్రం.

News September 14, 2024

కారుపైకి ఎక్కి జగన్‌కు ముద్దుపెట్టిన అభిమాని

image

AP: YS జగన్ జిల్లాల పర్యటనలో భద్రతా వైఫల్యం ఉందని YCP శ్రేణులు విమర్శిస్తున్నాయి. నిన్న పిఠాపురం నియోజకవర్గంలోని మాధవపురంలో జగన్ పర్యటిస్తుండగా.. ఓ అభిమాని కారుపైకి ఎక్కి జగన్‌పై పడిపోతూ ముద్దులు పెట్టిన ఘటనను ఉదాహరణగా చూపిస్తున్నాయి. అతడు జగన్ వద్దకు దూసుకెళ్తుంటే మాజీ MLA జక్కంపూడి రాజా అతడి కాలు పట్టుకుని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు భద్రత పెంచాలని YCP శ్రేణులు కోరుతున్నాయి.

News September 14, 2024

మా దేశం సురక్షితమే.. భారతీయులు రండి: ఇరాన్

image

ఇరాన్‌లో ఉద్రిక్తతల దృష్ట్యా పర్యాటకం బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో తమ దేశానికి రావాలంటూ భారత్‌లో ఇరాన్ రాయబారి ఇరాజ్ ఇలాహీ భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ‘ఇజ్రాయెల్‌కు ఇరాన్‌కు మధ్య ఉద్రిక్తతలు ఎప్పటి నుంచో ఉన్నవే. మా దేశం చాలా సురక్షితం. భారత మిత్రులు వచ్చి పర్యటించండి’ అని కోరారు. ప్రస్తుతం ఇరు దేశాలకు మధ్య 2 విమానాలు మాత్రమే డైరెక్ట్‌గా నడుస్తుండగా, అవి మరింతగా పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.