News August 2, 2024

వరి విత్తనాలపై 80% రాయితీ

image

AP: అధిక వర్షాలకు వరి పంట దెబ్బతిన్న జిల్లాల్లో 80 శాతం రాయితీతో విత్తనాలు సరఫరా చేయనున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో 6,356 క్వింటాళ్ల విత్తనాలను రైతు సేవా కేంద్రాల వద్ద పంపిణీ చేస్తామన్నారు. ఈ ప్రాంతాల్లో గత నెలలో 1,406 హెక్టార్లలో నారు మడులు, 33 వేల హెక్టార్లలో వరి పంట నాశనమయ్యాయని చెప్పారు.

Similar News

News December 6, 2025

మర్రిగూడ: పట్టుబడుతున్నా మారట్లేదు

image

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందన్న చర్చ నడుస్తోంది. గతంలో పనిచేసిన తహశీల్దార్లు మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్, సర్వేయర్ రవి నాయక్ పలువురి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడడం మండలంలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకుని సక్రమంగా విధులు నిర్వహించి మర్రిగూడకు మంచి పేరు తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.

News December 6, 2025

కెప్టెన్సీకి నేను సిద్ధం: రియాన్ పరాగ్

image

IPL-2026లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పరాగ్ తెలిపారు. ‘గత సీజన్‌లో 7-8 మ్యాచులకు కెప్టెన్సీ చేశా. 80-85% సరైన నిర్ణయాలే తీసుకున్నా. మినీ ఆక్షన్ తర్వాత కెప్టెన్ ఎవరనేది డిసైడవుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ CSKకి ట్రేడ్ అవడంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే చర్చ జరుగుతోంది. జైస్వాల్, జురెల్, పరాగ్ ఈ రేసులో ఉన్నారు.

News December 6, 2025

రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

image

AP: అతి తక్కువ ధరకే వారసత్వ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నామమాత్రపు స్టాంపు డ్యూటీ వసూలుతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ రూ.10 లక్షలలోపు ఉంటే రూ.100, దానికంటే ఎక్కువైతే రూ.1,000 స్టాంపు డ్యూటీ వసూలు చేస్తారు. భూ యజమాని మరణించిన తర్వాత వారసులకు సంక్రమించిన ఆస్తులకే ఈ రాయితీ వర్తిస్తుంది.