News August 2, 2024

వరి విత్తనాలపై 80% రాయితీ

image

AP: అధిక వర్షాలకు వరి పంట దెబ్బతిన్న జిల్లాల్లో 80 శాతం రాయితీతో విత్తనాలు సరఫరా చేయనున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో 6,356 క్వింటాళ్ల విత్తనాలను రైతు సేవా కేంద్రాల వద్ద పంపిణీ చేస్తామన్నారు. ఈ ప్రాంతాల్లో గత నెలలో 1,406 హెక్టార్లలో నారు మడులు, 33 వేల హెక్టార్లలో వరి పంట నాశనమయ్యాయని చెప్పారు.

Similar News

News December 7, 2024

మిస్టీరియస్ వ్యాధి.. 143 మంది మృతి

image

DR కాంగో దేశంలో మిస్టీరియస్ వ్యాధి కలకలం రేపుతోంది. చికిత్స లేని ఈ రోగం బారినపడి నవంబర్‌లో 143 మంది మరణించారు. బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలు, అనీమియా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో WHO హై అలర్ట్ ప్రకటించింది. అక్కడికి స్పెషల్ టీమ్‌ను పంపింది. ‘మేం ఏ వ్యాధితో పోరాడుతున్నామో అర్థం కావట్లేదు. అది వైరల్/బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అనేది తెలియదు’ అని అధికారులు తెలిపారు.

News December 7, 2024

EVMలపై డౌట్‌: ప్రమాణం చేయని MVA MLAs

image

మహారాష్ట్రలో EVMల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ MVA MLAలు నేటి ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించారు. ‘గెలుపొందిన మా MLAలు నేడు ప్రమాణం చేయరు. మాకు EVMలపై అనుమానాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం కూనీ అయింది’ అని శివసేన UBT అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ‘ఫలితాలపై సందేహాలొస్తున్నాయి. మొత్తం ప్రక్రియ కళంకితమైంది. ఏదో తప్పు జరిగినట్టు ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు’ అని కాంగ్రెస్ MLA విజయ్ తెలిపారు.

News December 7, 2024

గుడ్డిగా గూగుల్‌ను నమ్మితే..

image

తెలియని ప్రదేశానికి వెళ్లేటప్పుడు చాలామంది అనుసరిస్తున్నది గూగుల్ మ్యాప్స్‌నే. ఇది రెండువైపులా పదునైన కత్తి. ఎంతగా ఉపయోగపడుతుందో గుడ్డిగా నమ్మితే నట్టేట ముంచడమూ ఖాయమే. మ్యాప్స్ పెట్టుకొని వెళ్లి అడవుల్లో తేలడం, నదిలో మునగడం, వంతెనలపై నుంచి పడిపోవడం తెలిసిందే. ఇలాంటప్పుడు సొంత మెదడు వాడాలని నిపుణులు చెప్తున్నారు. ఆ రోడ్లపై రాకపోకలు లేకున్నా, వాహనాలు, మనుషులు ఎదురవ్వకున్నా అనుమానించాలని అంటున్నారు.