News August 17, 2024

సైన్యం చేతిలో 80 మంది ఊచకోత

image

సూడాన్‌లోని ఓ గ్రామంలో పారామిలిటరీ బలగాలు 80 మందిని ఊచకోత కోశాయి. సిన్నార్ స్టేట్‌లోని జలక్ని గ్రామంలో ఈ ఘటన జరిగింది. తొలుత గ్రామానికి చెందిన యువతులను కిడ్నాప్ చేసేందుకు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో పారామిలటరీ బలగాలు రెచ్చిపోయి గ్రామంలో రక్తపాతం సృష్టించాయి. కనిపించిన వారిని కనిపించినట్లే కాల్చివేశారు. దీనిపై RSF ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

Similar News

News February 15, 2025

‘లవ్‌జిహాద్’ను అడ్డుకునే దిశగా మహారాష్ట్ర..?

image

‘లవ్‌జిహాద్’ పై మహారాష్ట్ర ప్రభుత్వం డీజీపీ సంజయ్‌వర్మ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. బలవంతపు మత మార్పిడులను అడ్డుకోవడానికి న్యాయపరంగా ఉన్న అవకాశాలు, పలు రాష్ట్రాలలో అమలవుతున్న చట్టాలను విశ్లేషించి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వనుంది. త్వరలోనే ప్రభుత్వం ‘లవ్‌జిహాద్’ను నివారించేందుకు చట్టం తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే విపక్షాలు కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి.

News February 15, 2025

కోడ్ లేని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం: భట్టి

image

TG: MLC ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్ నుంచి నిర్మాణం ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రచారం చేయాలని I&PR, హౌసింగ్‌ శాఖలపై సమీక్షలో ఆయన వెల్లడించారు. ORR, RRR చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు నిర్మించాలని సూచించారు. మధ్య తరగతి ప్రజల కోసం LIG, MIG, HIG ఇళ్లు కట్టాలని చెప్పారు.

News February 15, 2025

ADE అక్రమాస్తులు రూ.100 కోట్లు!

image

TG: గచ్చిబౌలిలో విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ నివాసంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. HYD, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22ఎకరాల భూమి, ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. అలాగే బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిన్న రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీకి దొరికారు. సోదాల అనంతరం సతీశ్‌ను అరెస్ట్ చేశారు.

error: Content is protected !!