News February 28, 2025
$280కి బదులుగా $81 ట్రిలియన్ల జమ.. చివరికి!

అమెరికాకు చెందిన citi బ్యాంక్ ఓ ఘోర తప్పిదం చేసింది. ఓ కస్టమర్ అకౌంట్‌లో 280 డాలర్లకు బదులుగా పొరపాటున $81 ట్రిలియన్లను జమ చేసింది. దీన్ని ఇద్దరు సిబ్బంది గుర్తించలేకపోయారు. మరో ఉద్యోగి దాదాపు 90 నిమిషాల తర్వాత పసిగట్టి తప్పును సరిదిద్దారు. ఇంత భారీ మొత్తంలో పేమెంట్ ప్రాసెస్ పూర్తికాలేదని, అయినా వెంటనే దోషాన్ని గుర్తించామని కంపెనీ తెలిపింది.
Similar News
News March 27, 2025
ఆ భూమి వేలాన్ని నిలిపివేయండి: కిషన్ రెడ్డి

TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ ప్రాంతంలో అనేక వృక్ష, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ వ్యతిరేకించారని గుర్తు చేశారు.
News March 27, 2025
హీట్ వేవ్.. వారికి కిడ్నీ సమస్యలు!

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇళ్లలో ఉన్నవారు ఉక్కపోతకు గురవుతుంటే కష్టజీవులు మండుటెండలో చెమటోడుస్తున్నారు. అయితే, ఎండలో ఎక్కువ సేపు పనిచేసేవారికి మూత్ర పిండాల సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా వ్యాధి బారిన పడిన వారిలో 60శాతం గ్రామీణులే ఉంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. రైతులు, రోడ్డు& భవన నిర్మాణ కార్మికులు, ట్రక్ డ్రైవర్లలో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు.
News March 27, 2025
సంపాదనలో రష్మిక మందన్న టాప్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రూ.70 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు ఫోర్బ్స్ సంస్థ తెలిపింది. త్వరలోనే ఇది రూ.100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఆమెకు హైదరాబాద్, బెంగళూరు, కూర్గ్, ముంబై, గోవాలో సొంత ఇళ్లు ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వెల్లడించాయి. దక్షిణాదిలో సంపాదనపరంగా రష్మికనే నంబర్‌వన్ అని చెప్పాయి.