News October 22, 2024

టెట్ పరీక్షకు 86 శాతం మంది హాజరు

image

AP: రాష్ట్రంలో 17 రోజులుగా కొనసాగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సోమవారంతో ముగిసింది. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661(86.38శాతం) మంది పరీక్షలు రాశారు. పేపర్-2ఏ సాంఘిక శాస్త్రం, పేపర్-2బీ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ‘కీ’ ఈ నెల 23 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.

Similar News

News October 22, 2024

పీఎం ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం.. దరఖాస్తుకు 3 రోజులే గడువు

image

పీఎం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏదైనా డిగ్రీ, పీజీ, డిప్లమా చేసిన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు pminternship.mca.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి దేశంలోని టాప్ 500 కంపెనీల్లో 12 నెలలపాటు ఇంటర్న్‌షిప్‌కు అవకాశాలు కల్పిస్తారు. వన్ టైమ్ గ్రాంట్ కింద రూ.6వేలు, ప్రతి నెల రూ.5వేలు స్టైఫండ్ చెల్లిస్తారు. DEC 2 నుంచి ఇంటర్న్‌షిప్ ప్రారంభిస్తారు.

News October 22, 2024

AI ఎఫెక్ట్‌.. ఫోన్ పే కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల్లో కోత

image

ఫోన్ పే కస్టమర్ సపోర్ట్ స్టాఫ్‌పై AI తీవ్ర ప్రభావం చూపింది. గత ఐదేళ్లలో 1,100 మంది(60 శాతం)ని ఫోన్ పే తొలగించింది. ఏఐ ఆధారిత చాట్ బోట్ల ద్వారా ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీసులతో సమర్థత పెరిగిందని ఫోన్ పే తన నివేదికలో పేర్కొంది. మరోవైపు కంపెనీ ఆదాయం పెంచుకుని నష్టాలనూ తగ్గించుకుంటోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3,085 కోట్లుగా ఉన్న ఆదాయం 2023-24లో రూ.5725 కోట్లకు చేరుకుంది.

News October 22, 2024

ఉచిత గ్యాస్ సిలిండర్‌పై UPDATE

image

AP: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ <<14417031>>సిలిండర్ల <<>>పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రతి 4 నెలల్లో లబ్ధిదారులు ఒక సిలిండర్(ఏడాదికి 3) ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం సిలిండర్ ధర ₹876గా ఉండగా, ఇందులో రాయితీ ₹25 జమ అవుతోంది. మిగతా ₹851ను సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెల 24 నుంచే ఉచిత గ్యాస్ బుకింగ్‌కు శ్రీకారం చుట్టేలా, దీపావళి నుంచి సరఫరాచేసేలా సమాలోచనలు చేస్తోంది.