News October 22, 2024
టెట్ పరీక్షకు 86 శాతం మంది హాజరు
AP: రాష్ట్రంలో 17 రోజులుగా కొనసాగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సోమవారంతో ముగిసింది. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661(86.38శాతం) మంది పరీక్షలు రాశారు. పేపర్-2ఏ సాంఘిక శాస్త్రం, పేపర్-2బీ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ‘కీ’ ఈ నెల 23 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
Similar News
News November 14, 2024
స్టార్ క్రికెటర్ల చిన్ననాటి ఫొటోలు
ఇవాళ చిల్డ్రన్స్ డే కావడంతో తమ అభిమాన హీరోలు, క్రికెటర్ల చిన్ననాటి ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. క్రికెటర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, సచిన్, ధోనీ, గిల్, యువరాజ్, పంత్, బుమ్రాల చైల్డ్‌హుడ్ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. నెలల బాబుగా ఉన్న రోహిత్ క్యూట్‌గా ఉన్నారని, మొదటిసారి ఈ ఫొటో చూస్తున్నామని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇందులో మీ అభిమాన క్రికెటర్ ఉన్నారా? కామెంట్ చేయండి.
News November 14, 2024
CBSE విద్యార్థులకు అలర్ట్
వచ్చే ఏడాది 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో మార్పులు ఉంటాయని వస్తున్న వార్తల్ని CBSE కొట్టిపారేసింది. సిలబస్ 15% తగ్గింపు సహా కొన్ని సబ్జెక్టుల్లో ఓపెన్-బుక్ పరీక్షలను ప్రవేశపెట్టడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఇండోర్‌లో జరిగిన ఓ సమావేశంలో సిలబస్ తగ్గిస్తున్నట్టు CBSE అధికారులు ప్రకటించారని వార్తలు వచ్చాయి. దీంతో బోర్డు ఈ వార్తల్ని ఖండించింది.
News November 14, 2024
OTTలోకి ‘కంగువా’ ఎప్పుడంటే?
సూర్య నటించిన ‘కంగువా’ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. శివ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ రూ.100కోట్లకు దక్కించుకున్నట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కోలీవుడ్ సినిమాలు 4వారాలకే ఓటీటీలోకి వెళ్తుండగా, అందుకు భిన్నంగా ‘కంగువా’ 6వారాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలో ఇది ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది.