News July 17, 2024
మెడికల్ కాలేజీల్లో 872 పోస్టులు
TG: రాష్ట్రంలోని 8 కొత్త మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం 872 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు, పొరుగుసేవల విధానంలో వీటిని భర్తీ చేయనుంది. ప్రొఫెసర్‌కు ₹1.90L, అసోసియేట్ ప్రొఫెసర్‌కు ₹1.50L, సహాయ ప్రొఫెసర్‌కు ₹1.25L గౌరవ వేతనంగా చెల్లించనుంది. నారాయణపేట, జోగులాంబ గద్వాల, మెదక్, ములుగు, నర్సంపేట, యాదాద్రి భువనగిరి, మహేశ్వరం కుత్బుల్లాపూర్‌లో ఈ కొత్త కాలేజీలు ఏర్పాటయ్యాయి.
Similar News
News December 9, 2024
మహ్మద్ యూనస్‌తో విక్రమ్ మిస్త్రీ బృందం భేటీ
బంగ్లా తాత్కాలిక చీఫ్ మహ్మద్ యూనస్‌తో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ బృందం సమావేశమైంది. సోమవారం ఇరుదేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం యూనస్‌ను కలిసింది. ఇరుదేశాల మధ్య అన్ని రంగాల్లో సహకారం కొనసాగింపు, సంయుక్త ప్రయోజనాలపై కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు భారత్ పేర్కొంది. అలాగే బంగ్లాలో మైనారిటీల భద్రతకు భరోసా కల్పించాలని కోరింది.
News December 9, 2024
ట్విస్ట్.. ఇద్దరు మంత్రులకు ఒకే నంబర్ నుంచి బెదిరింపులు
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు <<14834003>>హత్య బెదిరింపులు<<>> రావడంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. తనకు రెండు రోజుల క్రితం బెదిరింపులు వచ్చిన నంబర్ నుంచే ఈ కాల్ వచ్చినట్లు హోంమంత్రి గుర్తించారు. దీంతో ఆగంతకుడిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆమె ఆదేశించారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బందర్ రోడ్డు నుంచి మల్లిఖార్జున రావు అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.
News December 9, 2024
నాపై దాడి చేశారు.. ప్రాణహాని ఉంది: మంచు మనోజ్
TG: పహాడీ షరీఫ్ పీఎస్‌కు వచ్చిన హీరో మంచు మనోజ్ నిన్న జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు. 10 మంది ఆగంతకులు తనపై దాడికి పాల్పడ్డారని, ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. విజయ్, కిరణ్ సీసీ ఫుటేజీ తీసుకెళ్లారని చెప్పినట్లు వెల్లడించారు. ఫిర్యాదు మేరకు మనోజ్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని సీఐ వివరించారు. ఫిర్యాదులో కుటుంబ సభ్యుల పేర్లు లేవని ఆయన స్పష్టం చేశారు.