News May 18, 2024
ఆరో దశ బరిలో 889 మంది
లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో మే 25న జరిగే పోలింగ్‌లో ఓటర్లు వీరి భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. ఈ స్థానాలకు మొత్తం 1978 నామినేషన్లు దాఖలు కాగా ఉపసంహరణ తర్వాత 889 మంది బరిలో నిలిచారని ఈసీ పేర్కొంది. వాతావరణ కారణాలతో వాయిదా పడిన JKలోని అనంతనాగ్-రజౌరి స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది.
Similar News
News December 25, 2024
కొడుకు చనిపోయాడని హీరోయిన్ పోస్ట్.. నెటిజన్ల ఫైర్
‘ఈరోజు నా కొడుకు జోరో చనిపోయాడు. అతడు లేని నా లైఫ్ జీరో. నేను నా కుటుంబం షాక్‌లో ఉన్నాం’ అని హీరోయిన్ త్రిష Xలో పోస్ట్ చేశారు. దీంతో షాకైన ఫ్యాన్స్ ‘మీకు పెళ్లెప్పుడైంది? కొడుకు ఎప్పుడు పుట్టాడు?’ అని ఆరా తీశారు. తర్వాత ఆమె తన కుక్క చనిపోయిన ఫొటోలను షేర్ చేశారు. త్రిష చెప్పిన ‘కొడుకు’ కుక్క అని తెలియడంతో ‘ఆ విషయం ముందే చెప్పొచ్చుగా? ఎందుకు గందరగోళం సృష్టించడం?’ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
News December 25, 2024
మరోసారి సత్యాగ్రహం: కాంగ్రెస్
నవ సత్యాగ్రహం పేరుతో మరోసారి సత్యాగ్రహ స్ఫూర్తిని రగిలించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో తెలిపింది. 1924, డిసెంబరు 26న కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీజీ పగ్గాలు స్వీకరించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని బెళగావిలో రేపు ‘నవ సత్యాగ్రహ బైఠక్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో ఎల్లుండి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది.
News December 25, 2024
మధుమేహులు ఇలా చేయడం మంచిది: నిపుణులు
డయాబెటిస్తో ఇబ్బందిపడేవారు జీవితంలో నడకను భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారానికి 150 నిమిషాల నడక ఉండాలని పేర్కొంటున్నారు. ‘మధుమేహులు రోజుకు అరగంట చొప్పున వారంలో కనీసం 5 రోజులు నడవాలి. డయాబెటిస్‌ను అదుపులోకి తీసుకురావడంలో వాకింగ్ మంచి ఫలితాన్నిస్తుంది. ఒకేసారి అరగంట నడవలేకపోతే 10 నిమిషాల చొప్పున మూడు లేదా నాలుగుసార్లు నడుస్తున్నా ప్రయోజనం ఉంటుంది’ అని వివరిస్తున్నారు.