News May 18, 2024
ఆరో దశ బరిలో 889 మంది
లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో మే 25న జరిగే పోలింగ్‌లో ఓటర్లు వీరి భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. ఈ స్థానాలకు మొత్తం 1978 నామినేషన్లు దాఖలు కాగా ఉపసంహరణ తర్వాత 889 మంది బరిలో నిలిచారని ఈసీ పేర్కొంది. వాతావరణ కారణాలతో వాయిదా పడిన JKలోని అనంతనాగ్-రజౌరి స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది.
Similar News
News December 4, 2024
కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు: CM
TG: ప్రజల ఆశీస్సులతోనే సామాన్యుడినైన తాను సీఎం అయ్యానని సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి యువ వికాసం సభలో అన్నారు. ‘తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ మొదట ఈ గడ్డపై నుంచే చెప్పారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేసీఆర్ పాలనలో గిట్టుబాటు ధర రాక రైతులు ఉరేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయనకు మాత్రం ఎకరాకు రూ.కోటి ఆదాయం వచ్చింది’ అని విమర్శించారు.
News December 4, 2024
మూవీ ముచ్చట్లు
* 2025 జనవరి 4న ‘రఘువరన్ బీటెక్’ రీరిలీజ్
* పుష్ప-2 మరో రికార్డ్.. బుక్ మై షోలో ఫాస్టెస్ట్ 2 మిలియన్ టికెట్స్ సేల్
* ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఓటీటీలోకి అమరన్(నెట్‌ఫ్లిక్స్), మట్కా(అమెజాన్)
* 12వేలకు పైగా థియేటర్లలో పుష్ప-2 విడుదల
* డ్రగ్స్ కేసులో తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కొడుకు అలీఖాన్ తుగ్లక్ అరెస్ట్
News December 4, 2024
గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం
TG: గ్రూప్-4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. పెద్దపల్లిలో నిర్వహించిన ‘యువ వికాసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాగా ఏటూరు నాగారం, పెద్దపల్లికి బస్ డిపోలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.