News September 11, 2024
రాష్ట్రంలో 8,915కు చేరిన ఎంబీబీఎస్ సీట్లు

TG: రాష్ట్రంలో ఈ ఏడాది 8 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. దీంతో మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరగా MBBS సీట్ల సంఖ్య 4,315కు చేరింది. ప్రైవేట్ కాలేజీలతో కలిపి మొత్తంగా ఈ సంఖ్య 8,915గా ఉంది. మరోవైపు కొత్త కాలేజీలకు అనుమతులిచ్చిన కేంద్రానికి, నిధులు కేటాయించిన సీఎం రేవంత్కు వైద్యారోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 5, 2025
దుష్ప్రచారాలు వ్యాప్తి చేయవద్దు : కలెక్టర్

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టంచేశారు. పెద్దంపేట సర్పంచ్ నామినేషన్ అంశంపై హైకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా పర్యటించానని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ కోర్టు విచారణకు హాజరుకాలేదని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటమన్నారు.
News December 5, 2025
రాష్ట్రపతి భవన్కు పుతిన్.. ఘన స్వాగతం

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘన స్వాగతం పలికారు. పుతిన్ గౌరవార్థం అక్కడ విందు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాయబారులు పాల్గొంటున్నారు. అయితే ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు ఆహ్వానం అందలేదు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను ఆహ్వానించడం గమనార్హం.
News December 5, 2025
హోంలోన్లు తీసుకునేవారికి గుడ్న్యూస్

RBI <<18475069>>నిర్ణయంతో<<>> హోంలోన్లపై వడ్డీరేటు కనిష్ఠ స్థాయికి చేరుకోనుంది. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీరేటు 7.35శాతంతో మొదలవుతోంది. ఇకపై ఇది 7.1శాతానికి పడిపోనుంది. గృహరుణాలు తీసుకోవడానికి ఇదే మంచి తరుణమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. మీరూ హోం లోన్ తీసుకుంటున్నారా?


