News September 11, 2024
రాష్ట్రంలో 8,915కు చేరిన ఎంబీబీఎస్ సీట్లు
TG: రాష్ట్రంలో ఈ ఏడాది 8 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. దీంతో మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరగా MBBS సీట్ల సంఖ్య 4,315కు చేరింది. ప్రైవేట్ కాలేజీలతో కలిపి మొత్తంగా ఈ సంఖ్య 8,915గా ఉంది. మరోవైపు కొత్త కాలేజీలకు అనుమతులిచ్చిన కేంద్రానికి, నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌కు వైద్యారోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 15, 2024
కొత్త టీచర్లకు నేడు పోస్టింగ్‌లు
TG: DSC ద్వారా టీచర్ పోస్టులకు ఎంపికైన వారికి విద్యాశాఖ ఇవాళ పోస్టింగ్‌లు ఇవ్వనుంది. ఇందుకోసం ఆయా జిల్లాల్లో స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఉ.9:30 నుంచి స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ ఉపాధ్యాయులకు, మ.12.30 నుంచి SGTలకు కౌన్సెలింగ్ జరుగుతుంది. నేడు కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి మిగిలిపోయిన ఖాళీల్లో పోస్టింగ్‌లు ఇవ్వనుంది. మొత్తం 11,062 ఖాళీలుండగా 10,006 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది.
News October 15, 2024
పవన్ కళ్యాణ్ కామెంట్స్ తొలగించాలని పిల్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిల్ దాఖలైంది. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పంపిన తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వులు కలిశాయని వ్యాఖ్యానించారని, వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించాలని లాయర్ రామారావు పిల్ వేశారు. మరోసారి పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ (నిషేధ) ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. నేడు ఈ పిల్ విచారణకు రానుంది.
News October 15, 2024
భూముల రీసర్వే.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
AP: భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలంది. భూసమస్యలపై ఈ గ్రామ సభల్లో వినతులు స్వీకరిస్తారు. రీ-సర్వేతో నష్టపోయిన రైతులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.