News November 24, 2024

RTMలో జాక్ మెక్‌గర్క్‌కు రూ.9కోట్లు

image

విధ్వంసకర ఓపెనర్ బ్యాటర్ జాక్ మెక్‌గర్క్‌‌ను ఢిల్లీ రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఇతని కోసం పంజాబ్, ఢిల్లీ పోటీ పడ్డాయి. RTM విధానంలో ఢిల్లీ మెక్‌గర్క్‌‌ను సొంతం చేసుకుంది. ఓపెనర్‌గా వచ్చి ఇతను భారీ హిట్లు కొట్టగలరు.

Similar News

News March 13, 2026

ఫ్లాష్ ఫ్లడ్స్‌ను 24hrs ముందే అంచనా వేయొచ్చు: పిచాయ్

image

పట్టణాల్లో ఆకస్మిక వరదలను 24hrs ముందే అంచనా వేసే ‘గ్రౌండ్ సోర్స్’ అనే కొత్త AI మోడల్‌ను రూపొందించినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. ‘జెమినీ’ సాయంతో ఇది 150+ దేశాల్లో 26లక్షల వరద సంఘటనలను విశ్లేషించిందని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు, ప్రజల సేఫ్టీ కోసం ఈ డేటాను గూగుల్ <>’ఫ్లడ్ హబ్<<>>’లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఏరియా పేరు సెర్చ్ చేయాలి. ముప్పు ఉంటే రెడ్ మార్క్ చూపిస్తుంది.

News March 13, 2026

సీక్వెల్ సినిమాకి డైరెక్టర్‌గా బోయపాటి?

image

‘అఖండ-2’ తర్వాత బోయపాటి శ్రీను చేసే తర్వాత సినిమా ఏంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. సన్నీ డియోల్‌తో ‘జాట్-2’ డైరెక్ట్ చేయమని ఆయన్ను మైత్రీ సంస్థ సంప్రదించినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘జాట్’కు ఇది సీక్వెల్‌గా రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఆఫర్‌ను తీసుకుంటారా? వదులుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.

News March 13, 2026

చరిత్రలో ఈ రోజు (మార్చి 13)

image

1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం (ఫొటోలో)
1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
1926: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్రరావు జననం
1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖేల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో హతమార్చాడు