News November 24, 2024

RTMలో జాక్ మెక్‌గర్క్‌కు రూ.9కోట్లు

image

విధ్వంసకర ఓపెనర్ బ్యాటర్ జాక్ మెక్‌గర్క్‌‌ను ఢిల్లీ రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఇతని కోసం పంజాబ్, ఢిల్లీ పోటీ పడ్డాయి. RTM విధానంలో ఢిల్లీ మెక్‌గర్క్‌‌ను సొంతం చేసుకుంది. ఓపెనర్‌గా వచ్చి ఇతను భారీ హిట్లు కొట్టగలరు.

Similar News

News December 7, 2024

ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది మృతి

image

లెబ‌నాన్‌పై కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని అమ‌లు చేస్తున్న ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుప‌డుతోంది. ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆస్ప‌త్రిపై జ‌రిపిన వైమానిక దాడిలో 29 మంది మృతి చెందారు. వరుస దాడులతో ఆస్పత్రి ప‌రిస‌రాలు ర‌క్త‌పుమ‌డుగుల‌తో నిండిన‌ట్టు అల్‌-జ‌జీరా తెలిపింది. 2023 Oct నుంచి ఇజ్రాయెల్ జ‌రుపుతున్న దాడుల్లో ఇప్ప‌టిదాకా 44,612 మంది పాలస్తీనియన్లు మృతి చెంద‌గా, ల‌క్ష‌కు పైగా గాయ‌ప‌డ్డారు.

News December 7, 2024

చంద్రబాబుపై VSR ఆరోపణలు.. టీడీపీ నేత ఫైర్

image

AP: పవన్‌ కళ్యాణ్‌పై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని MP <<14817304>>విజయసాయిరెడ్డి<<>> చేసిన ఆరోపణలపై TDP నేత బుద్దా వెంకన్న స్పందించారు. ‘కూటమి ప్రకటన వచ్చినప్పటి నుంచి మీ ఏడుపులను ప్రజలు గమనిస్తున్నారు. ఎలాగైనా కూటమి మధ్య చిచ్చు పెట్టాలనే మీ తెలివి తక్కువ చేష్టలను ప్రజలు నమ్మరు. ఇకనైనా ఇలాంటి ఫిట్టింగ్ మాస్టర్ పనులు ఆపి మీ పార్టీపై దృష్టి పెట్టండి. లేదంటే ఈసారి ఉన్న 11 సీట్లు కూడా ఊడతాయి’ అని ట్వీట్ చేశారు.

News December 7, 2024

బ్లడ్ షుగర్‌ను నియంత్రించే ఫుడ్స్ ఇవి..

image

ఓట్‌మీల్: ఇందులోని ఫైబర్ ఆకలి కానివ్వదు. ఎక్కువ ఆహారం తినకుండా సాయపడుతుంది. గుడ్లు: వీటిలోని ఖనిజాలు ఇన్సూలిన్ సెన్సిటివిటీని తగ్గిస్తాయి. బెండకాయ: ఇందులోని ఫ్లేవనాయిడ్స్, పాలీ సాకరైడ్స్ షుగర్‌ను తగ్గిస్తాయి. బెర్రీస్: వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు ఇన్సూలిన్ సున్నితత్వాన్ని నిరోధించి షుగర్‌ను కంట్రోల్ చేస్తాయి. డ్రైఫ్రూట్స్, ఫిష్: ఇందులోని ప్రొటీన్, హెల్తీ ఫ్యాట్స్ ఆరోగ్యానికి సాయపడతాయి.