News January 7, 2025
9 మంది RSS సభ్యులకు యావజ్జీవ శిక్ష

కేరళలో 19 ఏళ్ల క్రితం నాటి హత్య కేసులో 9 మంది RSS సభ్యులకు తలస్సేరి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 2005 అక్టోబరు 3న కన్నాపురం చుండాకు చెందిన 25 ఏళ్ల CPM సభ్యుడు రిజిత్ శంకరన్ను రాజకీయ వర్గపోరు వల్ల RSS కార్యకర్తలు ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. మరో ముగ్గురిని తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసులో జనవరి 4న నిందితులను దోషులుగా నిర్ధారించిన తలస్సేరి కోర్టు తాజాగా శిక్ష ఖరారు చేసింది.
Similar News
News August 28, 2025
సీఎస్ పదవీకాలం పొడిగింపు

TG: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సర్వీసును పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31న ఆయన రిటైర్ కావాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో సర్వీసును 7 నెలలు పొడిగించింది. దీంతో రామకృష్ణారావు వచ్చే ఏడాది మార్చి వరకు పదవిలో కొనసాగనున్నారు.
News August 28, 2025
VAD అంటే ఏంటి?

Vertebral artery dissection (VAD) అనేది వెన్నెముక ధమని లోపలి పొరల్లో సంభవించే చీలిక. ఈ ధమని మెదడుకు రక్త సరఫరా చేసే ప్రధాన రక్తనాళాల్లో ఒకటి. VAD వల్ల రక్త ప్రవాహం తగ్గి స్ట్రోక్ రావొచ్చు. హైబీపీ, స్మోకింగ్, మైగ్రేన్ లాంటి కారణాలతో VAD వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, బలహీనత, మాట్లాడేందుకు ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తాను VAD నుంచి కోలుకుంటున్నానని తెలంగాణ IAS <<17546623>>స్మిత<<>> ట్వీట్ చేశారు.
News August 28, 2025
రాష్ట్రంలో 4,472 విలేజ్ క్లినిక్లు: సత్యకుమార్

AP: రాష్ట్రంలో రూ.1,129 కోట్లతో 4,472 విలేజ్ క్లినిక్లు నిర్మిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. 80 శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని చెప్పారు. శ్రీకాకుళం-284, NDL-272, ఏలూరు-263, కోనసీమ-242, కృష్ణా-240, అల్లూరి-239, చిత్తూరు-229, బాపట్ల-211, మన్యం-205, ప్రకాశం, నెల్లూరు-203, అనకాపల్లి-200, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 100 M చొప్పున క్లినిక్లు నిర్మిస్తామన్నారు.