News August 22, 2024

రోజుకు 90 రేప్‌లు జరగడం భయానకం: మోదీకి మమత లేఖ

image

దేశవ్యాప్తంగా రోజుకు 90 రేప్‌లు జరుగుతుండటం భయానకమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పీఎం మోదీకి లేఖ రాశారు. ‘ఇది మన జాతి అంతరాత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. వీటిని అంతం చేయడం, మహిళల భద్రత మన బాధ్యతలు. ఇలాంటి తీవ్రమైన కేసుల్ని సమగ్రంగా పరిష్కరించాలి. దోషులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలు తేవాలి. త్వరిత న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. 15 రోజుల్లో విచారణ ముగించాలి’ అని ఆమె పేర్కొన్నారు.

Similar News

News November 20, 2025

క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కు ‘ఫేక్‌ కాల్స్’ అలర్ట్

image

సైబర్ మోసగాళ్లు క్రెడిట్ కార్డు వినియోగదారులను టార్గెట్ చేసుకుని స్కామ్ చేస్తున్నట్లు PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం హెచ్చరించింది. ‘ఓ స్కామ్‌లో మీ క్రెడిట్ కార్డు వాడారు. మీ కార్డును బ్లాక్ చేయబోతున్నాం’ అని RBI పేరిట వచ్చే కాల్స్, వాయిస్ మెయిల్స్, మెసేజెస్ అన్నీ ఫేక్ అని తేల్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వ లోగో, ఫొటో, వీడియోలు వాడిన అంశాలపై ఎలాంటి అనుమానం ఉన్నా ‘8799711259’ నంబరుకు పంపాలని సూచించింది.

News November 20, 2025

నేటి ముఖ్యాంశాలు

image

☛ AP: సత్యసాయి శతజయంతి వేడుకలకు హాజరైన PM మోదీ, CM CBN, సచిన్, ఐశ్వర్యరాయ్
☛ AP: సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు
☛ TGలో ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన CM రేవంత్
☛ TG: పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా సవరణకు EC షెడ్యూల్
☛ ప్రజల సొమ్ముతో CBN, పవన్, లోకేశ్ జల్సాలు: YCP
☛ AP: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు మృతి