News August 22, 2024
రోజుకు 90 రేప్‌లు జరగడం భయానకం: మోదీకి మమత లేఖ
దేశవ్యాప్తంగా రోజుకు 90 రేప్‌లు జరుగుతుండటం భయానకమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పీఎం మోదీకి లేఖ రాశారు. ‘ఇది మన జాతి అంతరాత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. వీటిని అంతం చేయడం, మహిళల భద్రత మన బాధ్యతలు. ఇలాంటి తీవ్రమైన కేసుల్ని సమగ్రంగా పరిష్కరించాలి. దోషులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలు తేవాలి. త్వరిత న్యాయం కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. 15 రోజుల్లో విచారణ ముగించాలి’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News September 20, 2024
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
News September 20, 2024
రేపు పండితులతో సీఎం చంద్రబాబు సమావేశం
AP: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై శాస్త్రాల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. రేపు ఆగమ, వైదిక పరిషత్‌లతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆలయ శుద్ధి అవసరమా? తదితర అంశాలపై పండితులు ఇచ్చే సూచనలు, సలహాలతో తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
News September 20, 2024
పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడట్లేదు: TN ప్రభుత్వం
AP: తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడుతున్నారన్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే ఏఆర్ డెయిరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.