News November 9, 2024

90 రన్స్ వద్దా బౌండరీ యత్నం.. దటీజ్ శాంసన్: సూర్య

image

తొలి టీ20లో సౌతాఫ్రికాపై సెంచరీ(107)తో అదరగొట్టిన సంజూ శాంసన్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించారు. కొన్నేళ్లుగా కఠోర శ్రమ చేస్తున్న అతనికి ఇప్పుడు దాని ఫలితాలు అందుతున్నాయన్నారు. 90 పరుగుల వద్ద ఉన్నప్పటికీ సంజూ బౌండరీ కోసం ప్రయత్నిస్తారని, జట్టు కోసం ఆడే వ్యక్తి అతనని కొనియాడారు. తాము అలాంటి వారికోసమే చూస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News December 4, 2024

3 లక్షల ఏళ్ల క్రితం నాటి మానవ పుర్రె

image

3లక్షల ఏళ్లకంటే పురాతనమైన మానవ అవశేషాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనా హవాయి విశ్వవిద్యాలయం కాలేజీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లోని మనోవా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ జె. బే వీటిని కనిపెట్టారు. ఆయన 30 ఏళ్లుగా ఆసియా అంతటా మానవ పూర్వీకులపై అధ్యయనం చేశారు. ఫలితంగా హోమో జులుయెన్సిస్ అనే పురాతన మానవ జాతిని గుర్తించారు. పెద్ద పుర్రె ఆధారంగా వీరి తలలు పెద్దగా ఉంటాయని తెలిపారు.

News December 4, 2024

రాహుల్ బయటేం చేస్తున్నారు?: LS ప్యానెల్ స్పీకర్

image

యూపీలోని సంభల్‌కు వెళ్తున్న రాహుల్ గాంధీని పోలీసులు <<14786784>>అడ్డుకోవడాన్ని<<>> కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశాన్ని ఆ పార్టీ ఎంపీ మహ్మద్ జావెద్ లోక్‌సభలో లేవనెత్తారు. ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్ ‘ఇక్కడ పార్లమెంట్ సెషన్ నడుస్తుంటే రాహుల్ బయటేం చేస్తున్నారు? ఆయన సమావేశాలకు హాజరవ్వాలి కదా?’ అని కౌంటర్ ఇచ్చారు.

News December 4, 2024

KCRపై కోపంతో CM అలా చేస్తున్నారు: KTR

image

TG: KCRపై కోపంతో CM రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చుతున్నారని KTR అన్నారు. ‘మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని KCR ఏర్పాటు చేయించారు. దానిని మార్చవద్దని CMకి చెబుతున్నా. ఇందిరా గాంధీ పెట్టిన భరత మాత విగ్రహాన్ని వాజపేయీ మార్చలేదు. రేవంత్ ఆటలు ఎల్లకాలం సాగవు. రాజీవ్ విగ్రహం ఉన్న చోటే భవిష్యత్తులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు.