News March 28, 2024

భారీ జీతంతో రైల్వేలో 9,144 ఉద్యోగాలు

image

ఇండియన్ రైల్వేలో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాలకు ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు 1,092, టెక్నీషియన్ గ్రేడ్-3 ఉద్యోగాలు 8,052 ఉన్నాయి. జులై 1 2024 నాటికి వయసు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రేడ్‌-1కు రూ.29,200-రూ.92,300, గ్రేడ్-3కి రూ.19,900-రూ.62,200 పే స్కేల్ లభించనుంది. విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News October 4, 2024

వయసు తగ్గిస్తామని రూ.35కోట్లు నొక్కేశారు

image

UPలోని కాన్పూర్‌లో రష్మీ, రాజీవ్ దూబే జంట ‘రివైవల్ వరల్డ్’ పేరుతో ఓ థెరపీ సెంటర్‌ను నెలకొల్పింది. ఇజ్రాయెల్‌ టైమ్ మెషీన్‌తో ఆక్సిజన్ థెరపీ చేసి వృద్ధులను 25ఏళ్ల వారిగా మారుస్తామంటూ నమ్మించింది. ఒక్కో సెషన్‌కు వారి నుంచి రూ.90వేలు రాబట్టింది. అలా దాదాపు పాతిక మందిని మోసం చేసి వారి నుంచి రూ.35కోట్లు వసూలు చేసింది. మోసాన్ని గుర్తించిన ఓ కస్టమర్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

News October 4, 2024

ఎల్లుండి ఇండియాకు రానున్న మయిజ్జు

image

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు ఈ నెల 6న భారత్ రానున్నారు. ఆదివారం నుంచి ఈ నెల 10 వరకు ఇక్కడ పర్యటిస్తారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీతో ఆయన చర్చలు జరపనున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కూడా సమావేశం అవుతారు. ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరులో మయిజ్జు పర్యటిస్తారు. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మయిజ్జు భారత పర్యటనకు వస్తుండడం విశేషం.

News October 4, 2024

మనకు ‘ఐరన్ డోమ్’ తరహా రక్షణ కీలకం: వాయుసేన చీఫ్

image

రక్షణ విషయంలో భారత్‌కూ ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ తరహా రక్షణ వ్యవస్థలు కీలకమని వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘ఇప్పటికే మనం ఐరన్ డోమ్‌వంటివి కొంటున్నా అవి సరిపోవు. దేశంలోని కీలక ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థల్ని మోహరించాలి. గగనతల దాడుల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆయుధ సరఫరా గడ్డు పరిస్థితుల్లో ఉన్నా భారత్ మేనేజ్ చేస్తోంది. నిరంతరం యుద్ధ సన్నద్ధతతో ఉండటం మనకు అత్యవసరం’ అని పేర్కొన్నారు.