News March 28, 2024

భారీ జీతంతో రైల్వేలో 9,144 ఉద్యోగాలు

image

ఇండియన్ రైల్వేలో 9,144 టెక్నీషియన్ ఉద్యోగాలకు ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు 1,092, టెక్నీషియన్ గ్రేడ్-3 ఉద్యోగాలు 8,052 ఉన్నాయి. జులై 1 2024 నాటికి వయసు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రేడ్‌-1కు రూ.29,200-రూ.92,300, గ్రేడ్-3కి రూ.19,900-రూ.62,200 పే స్కేల్ లభించనుంది. విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News February 16, 2026

విమానంలో ఇలా పాటలు వింటే అంతే..

image

విమానాల్లో ఇయర్‌ఫోన్స్ వాడకుండా పెద్ద శబ్దంతో పాటలు వినేవారిపై చర్యలు తప్పవని కేంద్రమంత్రి మురళీధర్ మోహోల్ హెచ్చరించారు. ఇలాంటివారిని అన్‌రూలీ ప్యాసెంజర్‌గా ట్రీట్ చేసి విమానం నుంచి దించేయడం/భవిష్యత్తులో ప్రయాణించకుండా బ్యాన్ చేసే ఆస్కారముందన్నారు. 1937 ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ మేరకు అనుమతి లేకుండా ఎయిర్‌పోర్టుల్లో, ఫ్లైట్‌లో ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని లోక్‌సభలో ఓ MP ప్రశ్నకు సమాధానమిచ్చారు.

News February 16, 2026

154 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL)లో 154 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, MLT, BE/BTech, MSc, MA/MSW, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/ అసెస్‌మెంట్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.becil.com

News February 16, 2026

అరటి సాగు: పిలకల ఎంపిక, నాటడంలో జాగ్రత్తలు

image

ఆరోగ్యవంతమైన అరటి తోటల నుంచే పిలకలను ఎంపిక చేయాలి. 3 నెలల వయసు, 2 లేదా 3 కోతలు పడిన సూడి పిలకలను ఎన్నుకోవాలి. పిలకలపై చర్మాన్ని పలచగా చెక్కి లీటరు నీటికి 2.5ml మోనోక్రోటోపాస్, కాపర్ ఆక్సీక్లోరైడ్ 5గ్రా. కలిపిన ద్రావణంలో 15 ని. ముంచి నాటాలి. పొట్టి పచ్చ అరటిని 1.5X1.5 మీ. దూరంలో, గ్రాండ్ నైన్, తెల్లచక్కెరకేళిని 1.8×1.8 మీ.. మార్టిమాన్, కర్పూర చక్కెరకేళి, కొవ్వూరు బొంతలను 2×2 మీ. దూరంలో నాటాలి.