News April 25, 2024

93.5% మార్కులు.. మూర్ఛపోయిన విద్యార్థి

image

ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తే ఎగిరి గంతులు వేయడం కామన్. అయితే.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ స్టూడెంట్‌కి మాత్రం వింత అనుభవం ఎదురైంది. ఇటీవల UP SSC బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో టెన్త్ విద్యార్థి అన్షుల్ కుమార్‌(16)కు 93.5% మార్కులు వచ్చాయి. అయితే తనకు ఊహించినదానికంటే ఎక్కువ మార్కులు రావడంతో అతడు మూర్ఛపోయాడు. దీంతో అతడిని ICUలో చేర్చాల్సి వచ్చింది.

Similar News

News March 19, 2026

బుమ్రా తర్వాత ఎవరు?.. అశ్విన్ ఆందోళన!

image

బుమ్రా రిటైర్మెంట్ తర్వాత భారత బౌలింగ్ విభాగం ఎదుర్కోబోయే ఛాలెంజెస్‌పై అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బ్యాటర్ల డామినేషన్‌ నడుస్తోందని, ఇది ఇప్పటి పిల్లలు బౌలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోకుండా డిస్‌కరేజ్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. బుమ్రా లాంటి మ్యాచ్ విన్నర్ లేకపోతే టోర్నీలు గెలవడం కష్టమన్నారు. టీమ్ ప్రయోజనాలకే ఇంపార్టెన్స్ ఇచ్చే గంభీర్ శైలిని ఈ సందర్భంగా ప్రశంసించారు.

News March 19, 2026

పాక్‌లో ఆర్థిక సంక్షోభం.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు

image

పశ్చిమాసియాలో యుద్ధంతో పాకిస్థాన్‌లో ఇంధన, ఆర్థిక సంక్షోభం పెరిగిపోయింది. దీంతో మార్చి 23న ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రిపబ్లిక్ డే పరేడ్‌ను ప్రధాని షెహబాజ్ షరీఫ్ రద్దు చేశారు. జెండా ఆవిష్కరణ మాత్రమే ఉంటుందని తెలిపారు. దీంతో సైనిక కవాతు, 31 గన్ సెల్యూట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండవు. దేశ గౌరవానికి నిదర్శనంగా నిలిచే వేడుకలు రద్దు కావడం ఆ దేశ దుర్భర స్థితికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.

News March 19, 2026

రేవంత్‌కు పాలనాపరంగా ఇబ్బందుల్లేవు.. పంచాంగ శ్రవణం

image

TG: నూతన సంవత్సరంలో వాణిజ్యం పంటలు సమృద్ధిగా పండుతాయని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణంలో బాచంపల్లి సంతోశ్ కుమార్ వెల్లడించారు. రైతులు ఆనందంగా ఉంటారని తెలిపారు. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. TPCC చీఫ్ మహేశ్ గౌడ్ నూతన పదవులు చేపడతారని పేర్కొన్నారు.