News December 4, 2024
రేవంత్ దేవుళ్లపై ఒట్లు వేయడం వల్లే భూకంపం వచ్చింది: కౌశిక్ రెడ్డి
TG: CM రేవంత్ దేవుళ్లపై ఒట్లు వేయడం వల్లే రాష్ట్రంలో భూకంపం వచ్చిందని BRS MLA పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. CM పాపాల నుంచి ప్రజలను దేవుళ్లే కాపాడాలన్నారు. మరోవైపు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని కౌశిక్ ఆరోపించారు. ఇటీవల తాను ఓ మిత్రుడి పార్టీకి వెళ్తే ఫోన్ ట్యాప్ చేయించి, అక్కడికి పోలీసులను పంపించారన్నారు. తన వద్ద డ్రగ్స్ పెట్టించి కేసులో ఇరికించాలని చూశారని మండిపడ్డారు.
Similar News
News December 27, 2024
రుణమాఫీకి ఆద్యుడు మన్మోహన్
ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా రైతు రుణమాఫీ అనేది కామన్ హామీగా మారిపోయింది. అయితే ఈ పథకానికి ఆద్యుడు మన్మోహన్ సింగ్. 2008లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది రైతులకు రూ.72,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఆ డేరింగ్ నిర్ణయం కారణంగానే యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా పార్టీలు ఎన్నికల్లో గెలుస్తున్నాయి.
News December 27, 2024
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నేడు వైసీపీ పోరుబాట
AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారు. కరెంట్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది.
News December 27, 2024
వారం రోజులు సంతాప దినాలు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో కేంద్రం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇవాళ కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఆయనకు సంతాపం తెలపనుంది.