News December 4, 2024

రేవంత్ దేవుళ్లపై ఒట్లు వేయడం వల్లే భూకంపం వచ్చింది: కౌశిక్ రెడ్డి

image

TG: CM రేవంత్ దేవుళ్లపై ఒట్లు వేయడం వల్లే రాష్ట్రంలో భూకంపం వచ్చిందని BRS MLA పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. CM పాపాల నుంచి ప్రజలను దేవుళ్లే కాపాడాలన్నారు. మరోవైపు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని కౌశిక్ ఆరోపించారు. ఇటీవల తాను ఓ మిత్రుడి పార్టీకి వెళ్తే ఫోన్ ట్యాప్ చేయించి, అక్కడికి పోలీసులను పంపించారన్నారు. తన వద్ద డ్రగ్స్ పెట్టించి కేసులో ఇరికించాలని చూశారని మండిపడ్డారు.

Similar News

News April 16, 2026

కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

image

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

News April 16, 2026

మహిళలకు ఈ క్యాన్సర్ల ముప్పు ఎక్కువ

image

మహిళలకు వచ్చే క్యాన్సర్‌ వ్యాధుల్లో సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్‌. వీటితోపాటు యూట్రస్‌ క్యాన్సర్‌, అండాశయ (ఓవేరియన్‌) క్యాన్సర్‌ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్‌, ఓవేరియన్‌ క్యాన్సర్‌ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

News April 16, 2026

మహిళల్లో క్యాన్సర్ ముప్పును పెంచే అలవాట్లు

image

సిగరెట్లు, మద్యం తాగే మహిళలకు, పురుషుల కంటే క్యాన్సర్, గుండె జబ్బుల ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. పొగాకులోని హానికారకాలకు మహిళల్లోని ఈస్ట్రోజెన్, ఇతర హార్మోన్లు, ఎంజైమ్‌లు స్పందించే తీరు భిన్నంగా ఉంటుందని ఇది క్యాన్సర్‌ కారకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులు, ఎంఫిసెమా, ఇతర తీవ్రమైన అనారోగ్యాల ముప్పును కూడా పెంచుతుంది.