News December 6, 2024

నేటి నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి రెవెన్యూ గ్రామ సదస్సులు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 8 వరకు 17,564 గ్రామాల్లో ఈ సదస్సులు కొనసాగుతాయి. భూముల రికార్డులను అప్డేట్ చేసేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి భూసమస్యలను పరిష్కరిస్తారు. అసైన్డ్, డొంక, వాగు పోరంబోకు, ఇనాం, దేవదాయ, వక్ఫ్, 22 ఏ, ఫ్రీ హోల్డ్ భూముల వివరాలు సేకరిస్తారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఈ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది.

Similar News

News March 28, 2026

BREAKING: అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

image

AP: రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలో ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. దీని కోసం ఇవాళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాగా ఐదున్నర గంటల పాటు చర్చ జరిగింది. ఈ నెల 30వ తేదీ తిరిగి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

News March 28, 2026

అల్లు అర్జున్‌కు నేనే డాన్స్ నేర్పించా: రాధిక ఫన్నీ కామెంట్స్

image

అల్లు అర్జున్‌కు తానే డాన్స్ నేర్పానని నటి రాధిక చెప్పారు. ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న డాన్స్ షోలో ఓ కంటెస్టెంట్ పుష్ప సాంగ్‌కు డాన్స్ చేశారు. జడ్జిమెంట్ టైమ్‌లో రాధిక మాట్లాడుతూ.. అల్లుఅర్జున్ ఇంత మంచి డాన్సర్ కావడానికి తానే కారణమన్నారు. గీతా ఆర్ట్స్‌లో తానో మూవీ తీశానని, అందులోని ఓ సీన్‌లో బాలుడిగా ఉన్న బన్నీని ఎత్తుకొని రైల్వే ట్రాక్ వెంట పరిగెడుతూ డాన్స్ చేయడం నేర్పించానని ఫన్నీగా చెప్పారు.

News March 28, 2026

‘వయాగ్రా’: ఏదో అనుకుంటే మరేదో అయ్యిందే..!

image

కొన్నిసార్లు ఒక వ్యాధి కోసం తయారుచేసిన మెడిసిన్ మరొకదానికి పనిచేయొచ్చు. అలాంటిదే ‘ఫైజర్’ సంస్థ 1990ల్లో తయారుచేసిన ‘సిల్డెనాఫిల్’. గుండె సంబంధిత చికిత్స కోసం దీనిని రూపొందించారు. అయితే క్లినికల్ ట్రయల్స్‌లో రోగులకు అంగస్తంభన కలగడం అనే ఊహించని సైడ్ ఎఫెక్ట్‌ను గుర్తించారు. ఇది వైద్య చరిత్రలో అతిపెద్ద మలుపుగా మారి ‘వయాగ్రా’గా ప్రసిద్ధి చెందింది. వైద్యరంగంలో ఇదొక ‘యాదృచ్ఛిక ఆవిష్కరణ’గా నిలిచిపోయింది.