News December 6, 2024

నేటి నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి రెవెన్యూ గ్రామ సదస్సులు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 8 వరకు 17,564 గ్రామాల్లో ఈ సదస్సులు కొనసాగుతాయి. భూముల రికార్డులను అప్డేట్ చేసేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి భూసమస్యలను పరిష్కరిస్తారు. అసైన్డ్, డొంక, వాగు పోరంబోకు, ఇనాం, దేవదాయ, వక్ఫ్, 22 ఏ, ఫ్రీ హోల్డ్ భూముల వివరాలు సేకరిస్తారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఈ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది.

Similar News

News January 17, 2025

ACCIDENT: 9 మంది దుర్మరణం

image

మహారాష్ట్రలోని నాసిక్-పుణే హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఐచర్ ప్యాసింజర్లతో వెళ్తోన్న మాక్సిమోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మాక్సిమో ముందున్న బస్సును ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం ధాటికి మాక్సిమో నుజ్జునుజ్జయింది. పుణే సమీపంలోని నారాయణ్‌గావ్ రోడ్డుపై ఈ యాక్సిడెంట్ అయింది.

News January 17, 2025

ఆర్థిక వ్యవస్థలో అమెరికాను దాటనున్న ఇండియా!

image

రానున్న 50 ఏళ్లలో ఇండియా జీడీపీ భారీగా పెరుగుతుందని ‘గోల్డ్‌మన్ సాక్స్’ అంచనా వేసింది. 2075 నాటికి ఇండియా $52.5 ట్రిలియన్‌తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. $57 ట్రిలియన్‌తో చైనా జీడీపీలో నంబర్ 1గా మారనుందని తెలిపింది. కాగా, మూడో స్థానంలో USA ($51.5 ట్రిలియన్‌), నాలుగో ప్లేస్‌లో ఇండోనేషియా ($13.7ట్రి), ఐదో స్థానంలో నైజీరియా ($13.1ట్రి) ఉంటాయని వెల్లడించింది.

News January 17, 2025

BJP మ్యానిఫెస్టో: అబ్బాయిలకూ ఫ్రీ బస్సు?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని చదువుకునే అబ్బాయిలకు, వృద్ధులకూ కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్కీం కింద మహిళలు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. అలాగే గృహావసరాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆలయాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ నడ్డా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.