News December 6, 2024

‘హ్యుందాయ్’ రేట్లు రూ.25వేలు పెంపు

image

తమ అన్ని రకాల వాహన మోడళ్ల ధరలను జనవరి 1 నుంచి రూ.25వేల వరకు పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా వెల్లడించింది. ముడి సరకు, రవాణా ఖర్చులు పెరగడం, మారకపు రేట్లు అనుకూలంగా లేకపోవడంతోనే ధరలను పెంచాల్సి వచ్చిందని తెలిపింది. పలు నివేదికల ప్రకారం రబ్బరు రేట్లు 26.8 శాతం, అల్యూమినియం 10.6%, జింక్ 16.5%, టిన్ 13.3%, కాపర్ ధర 5.3% పెరిగింది.

Similar News

News February 5, 2025

దేశంలో నాన్‌వెజ్ బ్యాన్ చేయాలి: శత్రుఘ్న సిన్హా

image

దేశంలో మాంసాహారంపై నిషేధం విధించాలని సినీనటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. మన దేశంలో చాలా చోట్ల బీఫ్ బ్యాన్ చేశారని, అలానే నాన్‌వెజ్‌ను కూడా బ్యాన్ చేయాలన్నారు. నార్త్‌ఈస్ట్‌తోపాటు దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో గొడ్డు మాంసం విక్రయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తరాఖండ్ తీసుకొచ్చిన యూసీసీ (యూనిఫామ్ సివిల్ కోడ్) చట్టాన్ని ఆయన ప్రశంసించారు.

News February 5, 2025

ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు ఒప్పుకోని ‘AAP’

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కొద్దిసేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఆప్ నేత సుశీల్ గుప్తా ఒప్పుకోలేదు. ‘ఇవి మాకు నాలుగో ఎన్నికలు. ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఆప్‌కు అధికారం వస్తుందని అంచనా వేయలేదు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పని చేశారు. ఫలితాలు మాకే అనుకూలంగా వస్తాయి. కచ్చితంగా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా అంచనా వేశాయి.

News February 5, 2025

కారు యజమానులకు GOOD NEWS!

image

నేషనల్ హైవేలపై తరచూ ప్రయాణం చేసే ప్రైవేట్ కారు యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వీరి కోసం ఏడాదికి రూ.3000, 15 ఏళ్లకు రూ.30000తో పాసులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. వీటితో దేశంలోని ఏ జాతీయ రహదారిపైనైనా ఎన్నిసార్లైనా తిరగొచ్చు. ప్రస్తుతం నెలకు రూ.340 పాసుతో ఒక టోల్ ప్లాజాలోనే వెళ్లాలనే రూల్ ఉంది. కొత్త విధానం ప్రకారం నెలకు రూ.250 చెల్లిస్తే చాలు.

error: Content is protected !!