News December 6, 2024

‘హ్యుందాయ్’ రేట్లు రూ.25వేలు పెంపు

image

తమ అన్ని రకాల వాహన మోడళ్ల ధరలను జనవరి 1 నుంచి రూ.25వేల వరకు పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా వెల్లడించింది. ముడి సరకు, రవాణా ఖర్చులు పెరగడం, మారకపు రేట్లు అనుకూలంగా లేకపోవడంతోనే ధరలను పెంచాల్సి వచ్చిందని తెలిపింది. పలు నివేదికల ప్రకారం రబ్బరు రేట్లు 26.8 శాతం, అల్యూమినియం 10.6%, జింక్ 16.5%, టిన్ 13.3%, కాపర్ ధర 5.3% పెరిగింది.

Similar News

News January 20, 2025

రెండు రాష్ట్రాలు.. ఒకే ఆత్మ: సీఎం చంద్రబాబు

image

దావోస్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ఫొటోను తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్ వెయిటింగ్ లాంజ్‌లో అనూహ్యంగా సమావేశమై రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు గురించి చర్చించాం’ అని రేవంత్ రాసుకొచ్చారు. దీనికి సీఎం CBN స్పందిస్తూ.. ‘రెండు రాష్ట్రాలు.. ఒకే ఆత్మ. తెలుగు సమాజం ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలి. TG సీఎం రేవంత్ గారిని కలవడం ఆనందంగా ఉంది’ అని రిప్లై ఇచ్చారు.

News January 20, 2025

కాసేపట్లో ప్రమాణం.. చర్చిలో ట్రంప్ ప్రార్థనలు

image

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సందడి వాతావరణం నెలకొంది. కాసేపట్లో ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్-మెలానియా దంపతులు సెయింట్ జాన్స్ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. వీరి వెంట వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్-ఉష దంపతులు కూడా ఉన్నారు. భారత కాలమానం ప్రకారం రా.10.30 గంటలకు ట్రంప్, వాన్స్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

News January 20, 2025

నూతన అధ్యక్షుడు తొలుత చేసే సంతకాలు ఇవే…!

image

అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ ఎన్నికల హామీలపై ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. మెక్సికోతో ఉన్న సరిహద్దును మూసివేయడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపడం, ఆర్మీలో ట్రాన్స్‌జెండర్ల నియామకానికి అడ్డుకట్ట వేయడంతో పాటు పలు కీలక ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.