News December 6, 2024

నాన్ ఓపెనర్‌గా రోహిత్ శర్మ గణాంకాలివే

image

AUSతో ఇవాళ్టి నుంచి జరిగే రెండో టెస్టులో తాను ఓపెనర్‌గా <<14796317>>రావట్లేదని<<>> కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించారు. అతను గతంలో 3-5 స్థానాల్లో బ్యాటింగ్ చేసినప్పుడు రికార్డు గొప్పగా లేదు. మూడో స్థానంలో ఐదుసార్లు ఆడి 107 రన్స్, ఫోర్త్ ప్లేస్‌లో ఓ సారి కేవలం 4 పరుగులు చేశారు. ఐదో స్థానంలో 437 రన్స్, ఆరో ప్లేస్‌లో 1,037 పరుగులు సాధించారు. మరి ఈ డేనైట్ టెస్టులో ఎలా రాణిస్తారో వేచి చూడాలి.

Similar News

News December 27, 2024

మన్మోహన్ చారిత్రక ఆర్థిక సంస్కరణలివే(1/2)

image

1991 నాటికి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ నిల్వలు అడుగంటిపోయాయి. అప్పులు పెరిగి రూపాయి విలువ తగ్గింది. ఆ సమయంలో ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ జట్టుకట్టారు. లిబరలైజేషన్(వ్యాపారాలకు నియంత్రణల తొలగింపు), గ్లోబలైజేషన్(విదేశీ పెట్టుబడుల కోసం మల్టీనేషనల్ కంపెనీలకు అనుమతి), ప్రైవేటీకరణ(ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ భాగస్వామ్యం) ప్రోత్సహించారు.

News December 27, 2024

మన్మోహన్ చారిత్రక ఆర్థిక సంస్కరణలివే(2/2)

image

1991లో ఎగుమతులను ప్రోత్సహించడానికి పరిమితులను కుదించారు. రూపాయి విలువను తగ్గించి విదేశీ మార్కెట్లో IND ఉత్పత్తులకు డిమాండ్ పెంచారు. పారిశ్రామిక వృద్ధికి అడ్డుకట్ట వేసే లైసెన్స్ రాజ్‌ను రద్దు చేశారు. కార్పొరేట్ పన్నులను పెంచారు. వంటగ్యాస్, చక్కెరపై సబ్సిడీలు తగ్గించారు. IMF సాయం పొందటం బంగారాన్ని తాకట్టు పెట్టారు. ఎగుమతి-దిగుమతి నిబంధనలను సరళీకరించారు. ఇలా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

News December 27, 2024

మన్మోహన్ ఆర్థిక సంస్కరణల ఫలితమిదే(2/2)

image

1991 ఆర్థిక సంస్కరణ కారణంగా IT, మాన్యుఫాక్చరింగ్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో యువతకు భారీగా ఉపాధి దొరికింది. ప్రస్తుతం ఉన్న ఐటీ రంగ వృద్ధికి అప్పటి నిర్ణయాలే పునాదులు. భారత్‌లో పోటీ పెరిగి, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చాయి. మధ్యతరగతి ఆదాయం పెరిగి, వినియోగం పెరిగింది. FDIలు భారీగా వచ్చాయి. ఆయన సంస్కరణల వల్ల భారతదేశం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది.