News December 6, 2024
నాన్ ఓపెనర్‌గా రోహిత్ శర్మ గణాంకాలివే

AUSతో ఇవాళ్టి నుంచి జరిగే రెండో టెస్టులో తాను ఓపెనర్‌గా <<14796317>>రావట్లేదని<<>> కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించారు. అతను గతంలో 3-5 స్థానాల్లో బ్యాటింగ్ చేసినప్పుడు రికార్డు గొప్పగా లేదు. మూడో స్థానంలో ఐదుసార్లు ఆడి 107 రన్స్, ఫోర్త్ ప్లేస్‌లో ఓ సారి కేవలం 4 పరుగులు చేశారు. ఐదో స్థానంలో 437 రన్స్, ఆరో ప్లేస్‌లో 1,037 పరుగులు సాధించారు. మరి ఈ డేనైట్ టెస్టులో ఎలా రాణిస్తారో వేచి చూడాలి.
Similar News
News February 12, 2026
రాష్ట్రంలో 859 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News February 12, 2026
ప్రైవేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్.. పొడిగింపు!

AP: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2024-25, 2025-26కు వర్తింపజేసింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో పేర్కొన్నా, ఫీజులపై స్పష్టతలేదు. దీంతో ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా జీవో ఇస్తోంది. కానీ జీవో జారీలో సమస్యతో స్టూడెంట్లకు ఫీజులు నిలిచిపోయాయి. తాజా ఆదేశాలతో విడుదలకానున్నాయి.
News February 12, 2026
ఓటు లైట్ తీసుకున్నారా?

TG: మున్సిపాలిటీ ఓటర్లు పోలింగ్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగటున 82% పోలింగ్ నమోదవ్వగా మున్సిపాలిటీల్లో 73శాతమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రామీణ ఓటర్లే బాధ్యతగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పలు చోట్ల వృద్ధులు, విదేశాల నుంచి వచ్చి మరి ఓటేసిన ఘటనలు ఉన్నా మరికొందరు రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడంలో చైతన్యంగా కనిపించలేదు.


