News December 6, 2024
REVATHI: భర్త, కుమారుడిని కాపాడిన మాతృమూర్తి..!

‘పుష్ప 2’ ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లి మృత్యువాత పడిన రేవతి వెనుక విషాద గాథ దాగి ఉంది. గతేడాది తన భర్త భాస్కర్ అనారోగ్యం పాలైతే ఆమె తన లివర్‌ను కొంత భాగం దానం చేసి ఆయనను బతికించుకున్నారు. అలాగే నిన్న తొక్కిసలాటలో కూడా కుమారుడిని తన పొత్తిళ్లలో ఉంచుకుని రక్షించుకున్నారు. కానీ ఆమె చివరకు తన ప్రాణాలే కోల్పోయారు. ఈ విషయాలన్నీ చెబుతూ ఆమె భర్త కన్నీరుమున్నీరు అయ్యారు.
Similar News
News March 17, 2026
ADB: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రహదారి భద్రతపై పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా నియమాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.
News March 17, 2026
SRH కెప్టెన్సీ రేసులో ఇద్దరు?

SRH జట్టులో కెప్టెన్ కమిన్స్ ఎప్పుడు చేరుతారో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మను కెప్టెన్ చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. తాజాగా ఇషాన్ కిషన్ పేరు కన్ఫర్మ్ అయిందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇషాన్‌కు 2016 U19 WCలో ఇండియాకు, డొమెస్టిక్ క్రికెట్‌లో ఝార్ఖండ్‌కు కెప్టెన్సీ చేసిన అనుభవముండగా, అభిషేక్ 2016 U19 ఆసియా కప్‌లో INDకు కెప్టెన్‌గా చేశారు. మరి వీరిలో SRH కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది?
News March 16, 2026
PHOTOS: శ్రీశైలం ఉత్సవాలు.. భృంగి వాహనంపై ఆది దంపతులు

AP: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు శ్రీస్వామి అమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపంలో ప్రత్యేక పూజలు అందుకున్న ఉత్సవమూర్తులకు వైభవంగా గ్రామోత్సవాన్ని జరిపించారు. గ్రామోత్సవం ముందు వివిధ కళారూపాల ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించింది. ఈనెల 20 వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.


