News December 6, 2024

పోలీస్ కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి

image

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని రెండు రోజుల కస్టడీకి ఇస్తూ కొడంగల్ కోర్టు తీర్పిచ్చింది. లగచర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఆయనను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అధికారులపై దాడి ఘటనలో నరేందర్ ప్రమేయం ఉందని, ఆయనను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది.

Similar News

News March 25, 2026

జనగామ జిల్లాలో సదరం శిబిరాల తేదీలు ఖరారు

image

జనగామ జనరల్ ఆసుపత్రిలో సదరం శిబిరాలు జూన్ నెలలో 3, 6, 9, 11, 12, 13, 18, 24, 25, 26, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వినికిడి లోపం, మానసిక సమస్యలు, తలసేమియా, క్రానిక్ న్యూరాలజీ సమస్యలు ఉన్న దివ్యాంగులు కొత్తగా లేదా రెన్యువల్ కోసం ముందుగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. యుడీఐడీ స్లాట్ బుక్ చేసుకుని శిబిరాలకు హాజరు కావాలని సూచించారు.

News March 25, 2026

స్టాక్ మార్కెట్లకు శాంతి చర్చల జోష్!

image

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 394 పాయింట్ల లాభంతో 23,306 వద్ద, సెన్సెక్స్ 1,205 పాయింట్లు ఎగసి 75,273 వద్ద క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్‌లో అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్, L&T, టైటాన్, ట్రెంట్ షేర్లు లాభపడగా, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టీసీఎస్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టపోయాయి.

News March 25, 2026

ఓటీటీలోకి అవతార్ 3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

image

హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 3 మూవీ OTT రిలీజ్ ఖరారైంది. ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీలో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది. హాట్‌స్టార్‌లో ఏప్రిల్ లేదా మే నెలలో భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ రాగా, ప్రపంచవ్యాప్తంగా రూ.13 వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.